ఓటుకు నోటు వ్యవహారం సినిమాల్లో లాగా ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. రేవంత్ రెడ్డితో మొదలైన ఓటుకు నోటు వ్యవహారం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు వరకు వచ్చేసింది. తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా వస్తున్న ఆడియో టేపుల మీద తెలుగుదేశం పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఆడియో టేపులను విడుదల చేస్తోందని.. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తోందని తెలుగుదేశం తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఫైర్ అయ్యారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి సీఎంను చూడలేదని ధ్వజమెత్తారు. బెదిరించి, ప్రలోభపెట్టి మరీ కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను.. టీఆర్ ఎస్ లో బలవంతంగా చేర్చుకుంటున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. నిధులు రాకుండా చేయడం, బిల్లులు ఆపేయడం వంటి పనులతో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి మాట్లాడిన మోత్కుపల్లి.. ఒక రాష్ట్ర సీఎం ఫోన్ ను ట్యాప్ చేయడం దారుణం అని మండిపడ్డారు. మరీ ఇంతగా దిగజారిన సీఎంను తాను చూడలేదన్నారు. మోసాలకు మారుపేరు కేసీఆర్ అని విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీని, చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మరోవైపు ప్రొ.జయశంకర్ చరిత్రను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే పాఠ్య పుస్తకాల్లోంచి కేసీఆర్ చరిత్రను తొలగిస్తామన్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more