Naayini | NarsimhaReddy | telangana | Tapping

Naayini narsmha reddy will be the first scape goat in phone tapping

Naayini, NarsimhaReddy, telangana, Homeminister, Tapping, Telangana, Ap, Chandrababu, Revanth Reddy

Naayini Narsmha Reddy will be the first scape goat in phone tappingTRS is unnecessarily inviting troubles by releasing audio tape between CBN and Stefenson. It seems that Tapping war between TDP and TRS might go worst political enmity between two parties

నాయిని నర్సింహారెడ్డి బలి..!

Posted: 06/08/2015 01:11 PM IST
Naayini narsmha reddy will be the first scape goat in phone tapping

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ముందు తెలంగాణ టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ ఏసీబీ అధికారులు తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపుల మీద చర్చించడానికి అత్యవసరంగా మీటింగ్ ఏర్పటు చేశారు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెంలగాణ ప్రభుత్వం కావాలనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ఏపి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఏపి అధికారులు మండిపడుతున్నారు. తమ ఫోన్లను ఎలా ట్యాప్ చేస్తారంటూ ఇప్పటికే ఏపి ప్రభుత్వం తరఫున విచారణ కూడా మొదలైంది. అయితే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకంగా ఏపి ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తోంది. మరి ఇలాగే సాగితే ఏపి ప్రభుత్వం చర్యలతో ఓ తెలంగాణ మంత్రి మాత్రం బలవక తప్పదు అన్న సంకేతాలు అందుతున్నాయి.

తెలంగాణ హోంమంత్రిగా పని చేస్తున్న నాయిని నర్సింహారెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ లో మొదట బలౌతారని కొంత మంది చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని వెల్లడించారు. అయితే ఏపి అధికారులు ఇదే స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి ఆధ్వర్యంలోనే ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయని ఏపి ప్రభుత్వం గనక సాక్షాలతో సహా నిరూపిస్తే మాత్రం తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఖచ్చితంగా బలౌతావరని తెలుస్తోంది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naayini  NarsimhaReddy  telangana  Homeminister  Tapping  Telangana  Ap  Chandrababu  Revanth Reddy  

Other Articles