Hanuman, Temple, Summons, Court, Madhyaprasdesh

Municipal officers summons the anajeyaswamy in madhyapradesh

Hanuman, Temple, Summons, Court, Madhyaprasdesh

Municipal officers summons the Anajeyaswamy in Madhyapradesh. In madhyapradesh Bhind dist municipal officers summons the anjaneyaswamy.

ఆంజనేయస్వామికి కోర్టు నోటీసులు..!

Posted: 06/08/2015 03:44 PM IST
Municipal officers summons the anajeyaswamy in madhyapradesh

మహాబలుడు, శ్రీరామ దూత ఆంజనేయుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు ఓ మున్సిపాలిటీ అధికారులు. ఆంజనేయస్వామి తన ఆలయం కోసం రోడ్డును అక్రమంగా ఆక్రమించాడని, ఆక్రమించిన ఆ స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆ స్వామికి నోటీసు కూడా ఇచ్చారు. ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలంటూ గ్వాలియర్ హైకోర్టు ఆదేశించినా మీరు అమలు చేయలేదు కనుక కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పరిగణించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్-లోని భింద్ జిల్లాలో రోడ్డును ఆక్రమించారంటూ ఆంజనేయస్వామికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బజారియా ప్రాంతంలో రోడ్డు పక్కనే ఓ ఆంజనేయస్వామి గుడి ఉంది. రోడ్డు స్థలం కొంచెం ఆలయ ప్రాంగణంలో ఉండడంతో మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. నిజానికి ఈ నోటీసులు ఆలయం పూజారికో లేక ఆలయ ట్రస్టీకో ఇవ్వకుండా ఏకంగా హనుమంతుడి పేరుతోనే నోటీసులు జారీచేశారు. ‘ఆంజనేయ స్వామీ? మీరు చట్టవిరుద్ధంగా రోడ్డును ఆక్రమించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు రోడ్డును ఆక్రమించడంతో ప్రమాదాలకు తావిస్తోంది. మీరు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని గ్వాలియర్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు. మీపై కోర్టు ధిక్కరణ కేసు పెడతాం’ అంటూ ఆ నోటీసులో మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఆంజనేయస్వామికి ఇలా డైరెక్ట్-గా నోటీసులు ఇచ్చిన వైనం తెలుసుకున్న స్థానికులు మండిపడడంతో టాప్ ర్యాంకులోని మున్సిపల్ అధికారులు జరిగిన పొరపాటును తెలుసుకున్నారు. ఆంజనేయుడి పేరుతో పొరపాటున నోటీసులు వచ్చాయని, వాటిని వెనక్కి తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hanuman  Temple  Summons  Court  Madhyaprasdesh  

Other Articles