Maulana Fazlur Rehman blames jeans wearing women for earthquakes

Earthquakes are caused by the jeans wearing women says fazlur rehman

Maulana Fazlur Rehman blames jeans wearing women for earthquakes, women jeans, earthquakes, pakistan terrorist leader, Fazlur rehman, ban on jeans, Earthquake in Nepal and Northern India 2015, Nepal Earthquake 2015, Pakistan

Jamiat Ulema-e-Islami Fazl (JUI-F) chief Maulana Fazlur Rehman said that women wearing jeans for problems like inflation and earthquake. Maulana Rehman asked the Pakistani armed forces to launch a military operation against “jeans-wearing women” across the country.

జీన్స్ ఫ్యాంటు ధరించడం వల్లే భూకంపాలు

Posted: 05/30/2015 08:38 PM IST
Earthquakes are caused by the jeans wearing women says fazlur rehman

భూకంపాలు ఎందుకు వస్తాయన్నది శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. భూమి పొరల్లోపల జరిగే మార్పుల కారణంగానని వాళ్లు అంటున్నారు. అయితే భూకంపాలకు మరో కోత్త కారణాన్ని వెలుగులోకి తీసుకోచ్చారు పాకిస్థాన్లోని ఓ ఉగ్రవాద నాయకుడు. జియాలజిస్టులు చెప్పేదంతా ఎంత మాత్రం కారణం కాదంటూనే జీన్సు ఫ్యాంటులు ధరించడమే కారణమని చెప్పుకోచ్చారు. ఏంటా జీన్సు ప్యాంటుకు వున్న ఆ ప్రత్యకత.. భూ కంపాలకు అవి ఎలా కారణమవుతాయా..? అని అనుకుంటే.. పురుషులు ధరించే జీన్స్ ప్యాంటుతో సమస్యలు లేవట. కేవలం మహిళలు ధరించే జీన్సు ప్యాంట్లే భూకంపాలకు కారణమట.

అదేంటి అనుకుంటున్నారా..? మహిళలు మగవారిలా వస్త్రాధారణ చేసుకోవడం, జీన్సు ఫ్యాంటులు ధరించడం అటు ద్రవ్యోల్బణం, ఇటు భూకంపాలు వస్తున్నాయని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా జీన్సు ప్యాంట్లు వేసుకునే మహిళలపై సైనిక ఆపరేషన్ ప్రారంభించాలని పాక్ సైన్యాన్ని కోరారు. ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీమాట చెప్పారు. తాలిబన్లు పాకిస్థాన్కు శత్రువులు కారని, అందువల్ల తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ మీద సైనిక ఆపరేషన్ చేయడం అనవసరమని ఆయన చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women jeans  earthquakes  pakistan terrorist leader  Fazlur rehman  

Other Articles