venkaiah naidu faces peoples ire on ap special status issue

Venkaiah faces peoples ire at vijayawada

venkaiah faces peoples ire at vijayawada, union minister venkaiah naidu, venkaiah naidu, ap special status, left parties, andhra pradesh special status issue, TDP. BJP

union minister venkaiah naidu faces peoples ire at vijayawada on andhra pradesh special status issue

కేంద్రమంత్రి వెంకయ్యకు బెజవాడలో చేధు అనుభవం

Posted: 05/30/2015 08:36 PM IST
Venkaiah faces peoples ire at vijayawada

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. మహిళా పారిశ్రామిక వేత్తలతో సదస్సులో పాల్గొనేందుకు గేట్వే హోటల్కు ఆయన వచ్చినప్పుడు.. హోటల్ బయట వామపక్షాల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించడంలో వెంకయ్య విఫలం అయ్యారంటూ నినదించారు. బీజేపీది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని సీపీఎం నాయకుడు బాబూరావు అన్నారు. ఎన్నికల ముందు పార్లమెంటులో ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్ల ప్రత్యేకహోదా కావాలని డిమాండు చేశారని, మోదీతో కలిసి ప్రచారంలో కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అతికష్టమైన సమస్యగా ఆయన చేతులెత్తేయడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా వున్న వెంకయ్య.. అధికార పక్షంలో ఒకలా.. ప్రతిఫక్షంలో మరోలా వ్యవహరించడం దేశ ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రరాష్ట్రానికి చట్టపరంగా ఇవ్వాల్సిన రాయితీలు ఎందుకు ఇవ్వలేదని బాబురావు నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం నిరసనలు పెల్లుబిక్కుతున్న తరుణంలో తాను కర్ణాటక రాజకీయాలతో మేలివితమైన మనిషినని, ఆంద్రతో సంబంధమే లేదని చెప్పడం ఆయన ద్వంద విధానానికి నిదర్శమని దుయ్యబట్టారు.

ఆంధ్రావాడినని చెప్పుకోడానికి వెంకయ్య సిగ్గుపడాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ మోసం చేస్తే, బీజేపీ-టీడీపీ కలిసి రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా, ఇతర హక్కులు ఇవ్వకుండా నాశనం చేస్తున్నాయని విమర్శించారు. వెంకయ్య రోజుకో మాట మారుస్తున్నారని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే హక్కు లేదన్న ఆయనకు.. ఓట్లడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  ap special status  left parties  

Other Articles