another Ttdp mla madhavaram krishnarao joins trs

Madhavaram krishnarao joins trs

madhavaram krishnarao joins trs, another Ttdp mla madhavaram krishnarao joins trs, siddipet, gajwel, chief minister KCR, chandrababu naidu, nara lokesh, kukatpally, kukatpally constituency, madhavaram krishnarao, farm house, jagadevpur

another Telangana tdp leader and kukatpally mla madhavaram krishnarao joins trs just before a day of mlc elections

టీఆర్ఎస్ గూటికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు

Posted: 05/30/2015 08:45 PM IST
Madhavaram krishnarao joins trs

మహానాడును సక్సెస్ ఫుల్ గా నిర్వహించామని భావిస్తున్న టీడీపీ అధిష్టానానికి ఆ మరుసటి రోజునే షాక్ ఎదురైంది. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఊదరగోట్టే అధినేత డైలాగులు అతనికి రుచించినట్టు లేదు. అందుకే గత కోంత కాలంగా పార్టీ నుంచి దూరంగా జరిగిన ఆయన ఏకంగా పార్టీ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ప్లేటు ఫిరాయించాడు. తమది నాయకులను తయారు చేసే కర్మగారమని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తమ పార్టీలో ఎక్కడ లోపముందో తెలుసుకోకుండా కూడా విశ్లేషించే ప్రయత్నం చేయకపోవడంతో పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు.

తాజాగా తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్లోని ఫాంహౌస్లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కృష్ణారావు చేరికను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ లో ఎంతగా ప్రయత్నించినా.. కృష్ణారావు మాత్రం ఆయనకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ ఉదయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన టీడీపీ సమావేశానికి కూడా కృష్ణారావు హాజరు కాలేదు. కాగా, టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన చంద్రబాబుకు, నారా లోకేశ్ కు క్షమాపణలు చెప్పారు. టీడీపీలో తనకు సరైన గౌరవం లభించిందని, అయితే నియోజకవర్గ అభివృద్ది కోసం మాత్రమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు.

సోమవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో  కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఐదో అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న కేసీఆర్ పట్టు కారణంగానే కృష్ణారావు చేరినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే తీగల కృష్ణారెడ్డి,  మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన పట్టును కోల్పోతున్నట్లు అవుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhavaram krishnarao  trs  TDP  

Other Articles