Kodanda Ram | Telangana | KCR | Osmania University

Kodanda ram said that telangana govt wrong step on osmania university lands

Kodanda Ram , Telangana, KCR, Osmania University, Lands

Kodanda Ram said that telangana govt wrong step on osmania university lands. He hope that the govt may quit on OU lands.

ఓయు భూములు ఆ ఇద్దరి మధ్య చిచ్చుబెట్టాయి..!

Posted: 05/25/2015 10:48 AM IST
Kodanda ram said that telangana govt wrong step on osmania university lands

ఒకప్పుడు ఒకరంటే ఒకరు కలియ తిరిగారు.. కానీ ప్రస్తుతం మాత్రం వారిద్దరి మధ్య ఓయు భూముల వ్యవహారం మంటలురేపింది. ఓయు భూముల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతొ మండిపడుతున్నారు ఆ నేత. ఇంతకీ ఆ నేత ఎవరు అనుకుంటున్నారా..? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జెఎసి చైర్మెన్ గా పోరాడిన కొదండరామ్. ఏంటీ కేసీఆర్ కు కోదండరామ్ కు చెడిందా అని ఇంకో ప్రశ్న వెయ్యకండి,. ఎందుకంటే చాలా క్లీయర్ లా తెలుస్తోంది కాబట్టి. ఒకప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసి తిరిగిన వాళ్లు ఇప్పుడు మాత్రం దూరం దూరం అంటున్నారు.

ఇళ్ల నిర్మాణానికి యూనివర్సిటి భూములను లాక్కోవడం అన్యాయం అని, ఏమాత్రం కరెక్ట్ కాదని కోదండరామ్ అన్నారు. అలానే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతిసపాదనలకు తాము వ్యతిరేకంగా అని వెల్లడించారు. అయితే ఓయు భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందనే భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదేనని, కానీ... వర్సిటీ భూములను మాత్రం విద్యా సంబంధ, పరిశోధనలకు మాత్రమే వాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సర్కారు ఉద్యోగాల నోటిఫికేషన్‌కు, కమల్‌నాథన్‌ కమిటీకి ముడిపెట్టడంపై కూడా కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే కమలనాథన్‌ కమిటీ పరిధిలో లేని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2 లోగా నోటిఫికేషన్లు వెలువడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodanda Ram  Telangana  KCR  Osmania University  Lands  

Other Articles