AP |Chandrababu | Ministers | Cabinet

Ap cm chandrababu naidu decided to give ministies to new mlcs

AP, Chandrababu, Ministers, Cabinet, MLC elections

Ap CM chandrababu naidu decided to give ministies to new MLCs. And some monisters may loss their ministry after the MLC elections.

ఏపిలో మంత్రి పదవులు మేళా.. చంద్రబాబు కసరత్తు షురూ

Posted: 05/25/2015 10:45 AM IST
Ap cm chandrababu naidu decided to give ministies to new mlcs

ఏపి రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటు మరికొంత మంది శాఖల్లో మార్పులు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వారిలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి మంత్రి వర్గంలో 20 మంది సభ్యులున్నారు. కడప జిల్లాకు ప్రస్తుతం మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు. విస్తరణలో ఈ జిల్లాకు అవకాశం దక్కవచ్చని భావిస్తు న్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ఒక్కరు మాత్రమే మంత్రి వర్గం లో ఉండగా విశాఖ, ఉభయగోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల నుంచి ఇద్దరు, కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మైనారిటీ, గిరిజన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూరైన సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రుల పనితీరు, ఆయా జిల్లాల్లో మంత్రులు పార్టీ అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఇప్పటికే వివిధ సంస్థల ద్వారా సర్వే నిర్వహిం చిన చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఆ సర్వే వివరాలను ముఖ్యమంత్రికి అందించారు. ప్రభుత్వపరంగా పోలీస్‌ నిఘా వర్గాలు మంత్రుల పనితీరుపై ఇప్పటికే సర్వే నిర్వహించింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనురాధ ఈ నివెెదిక ను రెండు దఫాలుగా సీఎంను కలిసి అందజేశారు. మంత్రులపై వస్తున్న అవినీతికి సంబంధించి జిల్లాల్లో లోతుగా అధ్యయనం చేసి జిల్లాల వారీగా అందజేసి నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరికి ఉద్వాసన తప్పదని తెలుస్తొంది. మరి ఆ ఇద్దరూ ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతొంది. మరి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారో, ఎవరికి ఉద్వాసన పలుకుతారో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తేలుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu  Ministers  Cabinet  MLC elections  

Other Articles