తమ దాంపత్య జీవితం సుఖంగా కొనసాగాలని భర్త పెట్టే వేధింపులు సైతం భార్యలు అనుభవిస్తుంటారు. కట్టుకున్న భర్తే తమకు దేవుడు, సర్వస్వం అనే భావించి జీవితాంతం వారి సేవలోనే మునిగిపోతారు మహిళలు! ఇందుకు అనుగుణంగా కొందరు భర్తలు తమ భార్యల్ని సంతోషపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు కానీ.. కొందరు భర్తలు మాత్రం మగాళ్లన్న అహంకారంతో వారు చూపించే ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోక రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.
భర్త వేధింపులు భరించలేక ఓ భార్య ఒంటికి నిప్పంటించుకుంది. దీంతో తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. చావుఅంచులదాకా వెళ్లి బతికిన ఆమెను ఆ దుర్మార్గుడు అక్కడా వదల్లేదు. ‘నువ్వింకా చావలేదా’ అని క్రూరంగా ప్రవర్తిస్తూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలంలోని పూలచెట్టుపాడుకు చెందిన రమేష్.. ఈ విధంగా తన భార్యను చంపేందుకు ప్రయత్నించాడు.
పూలచెట్టుపాడురగ చెందిన కొమ్ము రమేష్ మొదటి భార్య కొన్నేళ్ల క్రితం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆరేళ్ల క్రితం అతగాడు రాణిని రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి జీవితం సాఫీగానే కొనసాగింది కానీ.. రానురాను రమేష్ తన భార్య రాణి పట్ల రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మొదట తన భర్త మారుతాడని రాణి ఆశించింది కానీ.. అలా జరగక అతని వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ప్రతీరోజూ ఆ రాక్షసుడు రాణిని వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో ఆ వేధింపులకు తాళలేక ఆమె బుధవారం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాణిని బంధువులు తిరువూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో మూడు రోజుల క్రితం ఆమెను ఆ ఆస్పత్రికి తరలించారు. రాణిని చూసేందుకని ఆదివారం ఆస్పత్రికి వచ్చిన రమేశ్ ‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చనిపోలేదా?’ అంటూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. రాణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more