temparature | telangana | ap

Record level temperatures in telugu states the wather officials warns about the temperature

temparature, telangana, ap, nizamabad, adilabad

Record level temperatures in telugu states. The Wather officials warns about the temperature.

బయటికి వచ్చారో.. చచ్చారే.. హెచ్చరికలు జారీ

Posted: 05/21/2015 11:12 AM IST
Record level temperatures in telugu states the wather officials warns about the temperature

ఏంటీ..? ఏం జరుగుతోంది...? ఏమైనా ఎమర్జెన్సీయా ఏంటీ..?  అని తెగ ఆలోచించకండి. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీనే కానీ మీరనుకుంటున్న ఎమర్జెన్సీ మాత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. నిప్పుల కొలిమిలో ఉంటే ఎలా ఉంటుందో గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎన్నడూ లేనంతలా ఉష్ణాగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గతంలో కన్నా ఎక్కువగా మామూలు కన్నా దాదాపు నాలుగు నుండి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతోంది. దాంతో జనం నరకయాతన పడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే పరిస్థితి అతిదారుణంగా ఉంది.

అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం పది గంటల నుండి నాలుగు గంటల వరకు బయటికి రాకపోవడమే మంచిది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చెయ్యక తప్పలేదు. మహిళలు, ముసలా వారు, చిన్న పిల్లలు ఆరు బయటికి రాకపోవడం చాలా మంచి అని వారంటున్నారు. ఏ మాత్రం ఎండ వల్ల అనారోగ్యంగా అనిపించినా వెంటనే .జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ఏకంగా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉందని వారు వార్నింగ్ ఇస్తున్నారు. మరి వాతావరణశాఖ వారి ఆదేశాలు పాటిస్తూ కాస్త నీడపట్టున ఉంటే బెటర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temparature  telangana  ap  nizamabad  adilabad  

Other Articles