TDP | MLC | Jupudi prabhakar | Kukatpally

Telugudesamparty quit the name of jupudi prabhakar in the mlc elections

TDP, MLC, Jupudi prabhakar, Kukatpally, Vote

Telugudesamparty quit the name of jupudi prabhakar in the mlc elections. Jupudi prabhakar have vote in kukatpally but dont have vote in ap.

ఎమ్మెల్సీ లిస్ట్ నుండి జూపూడి ఔట్.. టైం బ్యాడ్ అంటే ఇదే మరి..!

Posted: 05/21/2015 10:52 AM IST
Telugudesamparty quit the name of jupudi prabhakar in the mlc elections

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా నుండి జూపూడి ప్రభాకర్ పేరును నాటకీయంగా తొలగించింది తెలుగుదేశం పార్టీ. పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని అనుకున్నా.. తర్వాత మాత్రం పరిణామాలు మారిపోయి.. లిస్ట్ నుండి జూపూడి పేరు తొలగించారు. ఏపిలో మండలి ఎన్నికల్లో పోటీకి సిద్దపడ్డ జూపూడి ప్రభాకర్ కు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓటు హక్కు ఉంది. కానీ ఏపిలో మాత్రం ఓటు హక్కు లేదు దాంతో ఓటు హక్కు లేని కారణంగా జూపూడిని ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా నుండి తొలగిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వచ్చింది. ముందు నుండి దళిత నేతగా ఉంటున్న జూపూడి.. దాదాపుగా ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతారు అనుకున్న సమయంలోనే అదృష్టం మరీ వెంటాడింది. దాంతో ఏపి మండలి అభ్యర్థుల జాబితా నుండి జూపూడి పేరు మాయమైంది.

అయితే తెలుగుదేశం పార్టీలో తాజాగా వచ్చి చేరిన జూపూడికి ఎలా సీటు ఇస్తారంటూ వివాదం చెలరేగిందని సమాచారం. అలా చాలా మంది సీనియర్లు జూపూడికి ఎమ్మెల్సీ సీట్ ను ఇవ్వడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వారిని ఎంతలా సముదాయించాలని భావించినా వారు మాత్రం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. అందుకే వారిని ఎలా సంతృప్తి పరచాలో తెలియని చంద్రబాబు నాయుడు జూపూడి ని ఎమ్మెల్సీ బరి నుండి తప్పించాలని ఆలోచించిచారట. అందులో భాగంగానే ఓటు హక్కు ఆయుధాన్ని వాడిమరీ జూపూడి నుండి ఎమ్మెల్సీ బరి నుండి ఔట్ చేసినట్లు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ అందినట్లే అంది ఎమ్మెల్సీ స్థానం జూపూడికి అందకుండా పోయింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  MLC  Jupudi prabhakar  Kukatpally  Vote  

Other Articles