Selfie | facebook | social media | net | photo | train

A selfie cost a life of teen in romania

Selfie, facebook, social media, net, photo, train

A Romanian teenager burst into flames after accidentally touching a live wire while attempting to take the 'ultimate selfie' on the roof of a train. Anna Ursu, 18, and a friend went to a train station in the town of Iasi in the northeast of the country to take a 'special selfie' that she intended to post on Facebook.

ఓ సెల్ఫీ ఆమె ప్రాణాలు తీసింది.. జాగ్రత్త

Posted: 05/15/2015 01:50 PM IST
A selfie cost a life of teen in romania

ఫోటోలు దిగాలంటే క్రేజ్ అనే మాట గతం ఇప్పుడు మాత్రం సెల్ఫీలు దిగాలంటే ఎంతో క్రేజ్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెల్ఫీలను పెడుతూ అందరి చేత కామెంట్లో, షేర్లో పొందాలని అనుకోవడం యూత్ కు మామూలైపోయింది. అయితే సెల్ఫీల పిచ్చి రాను రాను ముదిరిపోతోంది. ఎంతలా అంటే అందరి కంటే డిఫరెంట్ గా సెల్ఫీలు దిగాలన్న ఆరాటంలో కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెల్ఫీల కోసం ట్రైన్ మీదకెక్కి ప్రాణాలు కోలల్పోయింది ఓ యువతి. దాంతో బాబూ.. బీ సెల్ఫీల పిచ్చి మీ ప్రాణం మీదకు రాకుండా చూసుకోండి అంటూ నెట్ లో యూత్ కు సలహాలు వస్తున్నాయి. అసలు సెల్ఫీ వల్ల ప్రాణం ఎలా పోయిందంటే ఈ స్టోరీ చదవండి.

ఉత్తర రొమేనియాలో లాసి పట్టణంలో మొబైల్ తో సెల్ఫీ తీసుకోవాలని భావించిన ఒక యువతి, అందరికంటే భిన్నంగా ఆ సెల్ఫీ ఉండాలని ఒక రైలు మీదకు ఎక్కింది. సెల్ఫీ తీసుకునే ఆతృతలో, ఉత్సాహంలో ఆ రైలు పైన పక్కగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయనే విషయాన్నే మరిచిపోయింది ఆ యువతి. అలా....అలా....సెల్ఫీ తీసుకుంటూ వెళ్ళి , ఆ విద్యుత్ వైర్లు తాకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సరదాగా ఫోటో తీసుకోవడం కోసం ఆ రైలు ఎక్కి కొద్దిపాటి నిర్లక్ష్యంతో అకస్మాత్తుగా జరిగిన ఈ ఆశ్చర్యకర సంఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
(Source : mailonline.co.uk)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selfie  facebook  social media  net  photo  train  

Other Articles