Dog | yoga | baba ramdev | tv show | class

A dog doing yoga and following baba ramdev instructions

Dog, yoga, baba ramdev, tv show, class

A dog doing yoga and following baba ramdev instructions. A photo goes viral in net on baba ramdev yoga classes.

యోగా చెయ్యండి బాబూ అంటున్న కుక్క

Posted: 05/15/2015 01:17 PM IST
A dog doing yoga and following baba ramdev instructions

యోగా గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంటోంది. మారిన జీవన విధానానికి తగ్గట్టుగా మన శరీరం, మనస్సు మారాలంటే యోగా ఓ అద్భుతమైన మార్గం. అందుకే దేశ విదేశాల్లో యోగకు, యోగా నేర్పించే వారికి భలే క్రేజ్ పెరిగింది. అందులోనూ యోగా గురు బాబా రాందేవ్ గురించి అయితే చడ్డీలేసుకునే బుడ్డోన్ని అడిగినా చెప్పేస్తారు. అయితే బాబా రాందేవ్ ప్రతి రోజు టివిల్లో యోగా క్లాసులు తీసుకుంటూ కనిపిస్తుంటారు. చాలా మంది ఇళ్లలో బాబా రాందేవ్ ను ఫాలో అవుతూ యోగా ప్రాక్టిస్ చేస్తుంటారు. అయితే మరి యోగా మహిమ తెలుసుకుంటో ఏమో కానీ ఓ కుక్క యోగా చేస్తున్న ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.

బాబా రాందేవ్…… యోగాగురుగా ప్రపంచ ప్రసిద్ధి. ఈయన యోగా గురించి చెప్పే లెక్చర్లు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఆయన ఫాలోవర్స్ చాలామందే ఉన్నారు. ఇప్పటివరకు మనుషులే యోగా గురు దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కుక్క కూడా రాందేవ్ బాబాకి ఫిదా అయిపోయింది. ఆయన చేసే యోగాలు టీవీలో చూస్తూ ఫాలో అవుతోంది. ఎక్కడ , ఏమిటి అన్న వివరాలు అడగకండి. సరదాగా సోషల్ సైట్లో పెట్టిన ఈ పిక్ వైరల్ గా మారుతోంది. ఈ పిక్ ను చూసినవాళ్లంతా తమ స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే చివరకు కుక్కలు కూడా యోగా నేర్చుకుంటున్నాయి మరి మీరు నేర్చుకోరా అంటూ కొంత మంది యోగా నేర్చుకోండి అంటూ హితవు పలుకుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog  yoga  baba ramdev  tv show  class  

Other Articles