lady | smile | avoid | tesse

A lady hasn t smiled for 40 years

lady, smile, avoid, tesse

A smiling face gives positivity to oneself and the others around, but what if someone stops smiling and that too for a long span of 40 years. Well, if you feel shocked after listening to this, you need to meet this lady who hasn't smiled from past 40 years. The last time she smiled was at the age of 10.

ఈమె నవ్వి 40 సంవత్సరాలు అయ్యింది

Posted: 05/15/2015 03:36 PM IST
A lady hasn t smiled for 40 years

నవ్వు అన్ని రొగాలకు మందు అని అంటుంటారు. నవ్వు, నవ్వించు ఆరోగ్యాన్ని పెంచుకో అని చాలా మంది డాక్టర్లు కూడా అంటుంటారు. రోజుకు ఓ రెండు నిమిషాలు నవ్వితే చాలా మీకు ఎక్కడా లేని ఎనర్జీ వస్తుందని కూడా చాలా సర్వేల్లో తేలింది. అయితే నవ్వు మనకు ఫ్రీగా దొరికే మెడిసిన్ అలాంటిది ఓ లేడీ మాత్రం నేను నవ్వను బాబోయ్ అంటోంది. సరే ఇప్పుడు నవ్వకపోతే యే.. కొంత సేపటి తర్వాత నవ్వుతుంది కదా అని అనుకోకండి. ఎందుకు అలా అంటున్నారు అని అనుకుంటున్నారా..?  ఎందుకంటే ఆమె నవ్వి ఏకంగా 40 సంవత్సరాలు అయింది. అవును అప్పుడెప్పుడో చిన్నప్సుడు నవ్వింది అంతే మళ్లీ ఎప్పుడూ నవ్వలేదు. ఇంతకీ ఆమె ఎందుకు నవ్వలేదు...? అసలు ఆమె ఎవరు అన్న ప్రశ్నలకు ఈ ఆర్టికల్ లోనే సమాధానాలు ఉన్నాయి.

టెస్ క్రిస్టియన్ అనే మహిళ గత 40 సంవత్సరాల క్రితం నుండి నవ్వనే లేదంట. ఇంతకీ అంతలా నవ్వకపోవడానికి కారణ: ఏంటో తెలిస్తే మాత్రం పిచ్చా ఏంటి అని అడగక మానరు. విషయం ఏంటంటే నవ్వితే మొహం కండరాలు కదిలుతాయి.. తర్వాత తర్వాత మొహం మీద మడతలు వస్తాయంట... అందుకే ఆవిడ గారు నవ్వడం మానేశారు. ఆమెకు బిడ్డ పుట్టినా కూడా కనీసం నవ్వలేదు. అవును నిజం తన మొహం మీద మడతలు వస్తాయని నవ్వడం మానెయ్యడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. అయినా దీన్నే మనవాళ్లు పైత్యం అంటారు కావచ్చు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lady  smile  avoid  tesse  

Other Articles