Janareddy, Congress, Rahukl gandhi, Tour, TPCC, Uttamkumar

Congress senor leader janareddy didnt attend the meeting of congress yesterday

Janareddy, Congress, Rahukl gandhi, Tour, TPCC, Uttamkumar

Congress senor leader janareddy didnt attend the meeting of congress yesterday. On rahul tour in telangana congress conduct a meeting to review the arrangements.

జానీ.. జానీ ఎస్ పాపా.. జానారెడ్డి ఎక్కడప్పా?

Posted: 05/07/2015 10:23 AM IST
Congress senor leader janareddy didnt attend the meeting of congress yesterday

చిన్నప్పుడు చదువుకున్న జానీ..జానీ ఎస్ పాపా.. ఈటింగ్ షుగర్ నో. పప్పా.. గుర్తుండే ఉంటుంది. అయితే మన రాష్ట్రంలోనే ఓ పెద్దయాన్ను ప్రేమతో జానీ అని సంబోదించాంలెండి. కాంగ్రెస్ నాయకుల్లో సీనియర్, ఎంతో అనుభవమున్న నేత ఒకరు కనిపించకుండాపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత కనిపించకుండా పోయారా.. ఎవరబ్బా అని ఆలోచించకండి.. ఒకప్పుడు హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జానారెడ్డిగారి గురించి చెబుతున్నాం. కాంగ్రెస్ లో పెద్ద తలకాయగా, అసెంబ్లీలో పార్టీ నాలుకగా అనుకుంటున్న జానారెడ్డి గత కొంత కాలంగా కనిపించకుండా తిరుగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేత కే జానారెడ్డి ఆచూకీ కోసం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి జానారెడ్డి దూరంగా ఉన్నారు. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఇలా దాదాపు కాంగ్రెస్ నాయకులు అందరూ హాజరయ్యారు. ఒక్క జానారెడ్డి తప్ప.

అయితే ఎప్పుడూ కాంగ్రెస్ కార్యక్రమాలను ముందుండి నడిపించే జానారెడ్డి ఎందుకు కనిపించడం లేదు.. కాంగ్రెస్ పార్టీలో ఏవైనా విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఈ నెల 12న రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణ చాంద మండల పరిధిలో 15 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్నారు. రాహుల్ పర్యటన ఏర్పాట్లపై జరుగుతున్న చర్చలకు జానారెడ్డి దూరం కావడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి కూడా నల్లగొండ జిల్లా వారే. అయితే జానారెడ్డి కీలక సమావేశాలకు దూరంగా ఉండడంతో ఉత్తమ్ పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నోట్లో నాలుక లాంటి జానారెడ్డి లేకపోవడం కాంగ్రెస్ నాయకులకు క్లియర్ గా కనిపించింది. మరి కనీసం రాహుల్ పర్యటనలో అయినా కనిపిస్తారో లేదో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janareddy  Congress  Rahukl gandhi  Tour  TPCC  Uttamkumar  

Other Articles