Husband Chendrayudu Daughter Shanti Torchered Mother Ramanjinamma For Treasures

Husband chendrayudu daughter shanti torchered mother ramanjinamma for treasures

torcher, treasures, husband daughter torcher mother, black magic, Superstitions

Husband Chendrayudu Daughter Shanti Torchered Mother Ramanjinamma For Treasures : Husband Chendrayudu and Daughter Shanti Torchered Mother Ramanjinamma for treasures when a person told them.

గుప్తనిధుల కోసం తల్లిని చిత్రవధ చేసిన కూతురు

Posted: 05/07/2015 11:16 AM IST
Husband chendrayudu daughter shanti torchered mother ramanjinamma for treasures

తల్లి ఒడిలో ప్రేమానురాగాలు పలికిన ఓ కూతురు.. ‘శూర్పనఖ’లా తయారై ఆ తల్లినే చిత్రహింసలకు గురిచేసింది. తల్లి అని చూడకుండా మానవత్వం అనే పదాన్ని మంటలో కలిపేసింది. గుప్తనిధుల వ్యామోహంలో పడి తనకు జన్మనిచ్చిన తల్లినే కటకటాలు లెక్కించింది. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామాంజనమ్మ, చెండ్రారాయుడు దంపతులు చెర్లోపల్లిలో నివసిస్తున్నారు. వీరికి శాంతి అనే కుమార్తె ఉంది. అంతా సవ్యంగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఓ అవసరం నిమిత్తం ఇటీవల చెండ్రారాయుడు, ఆమె కుమార్తె శాంతి జ్యోతిష్యుడ్ని సంప్రదించారు. తమ ఆవేదనను అతని ముందు వెళ్లగక్కగా.. తల్లిని హింసిస్తే గుప్త నిధులు దొరుకుతాయని అతగాడు చెప్పాడు. అంతే! అతని చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి.. రామాంజినమ్మను వారిద్దరు చిత్ర హింసలకు గురి చేయడం మొదలుపెట్టారు.

కేవలం గుప్తనిధుల కోసం భార్య అని చూడకుండా భర్త, తల్లి అని చూడకుండా కూతురు ఇద్దరూ ఆమెను నిత్యం హింసించడమే పనిగా పెట్టుకున్నారు. దాంతో ఆమె పరిస్థితి విషమించడంతో స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. రామాంజనమ్మ పరిస్థితిని చూసి ఆస్పత్రి వైద్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తండ్రికూతురును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : torcher  treasures  husband daughter torcher mother  Superstitions  

Other Articles