Emergency | Service | 108

Emergency service provider 108 called for strike from today night

Emergency, Service, 108, ambulance, GVK, Govt

Emergency service provider 108 called for strike from today night. 108 employees demanding for regularisation and salary hike, but govt and gvk did respond on those demand.

మరో సమ్మెకు 'సై'రన్.. నిలిచిపోనున్న 108 సేవలు

Posted: 05/07/2015 08:22 AM IST
Emergency service provider 108 called for strike from today night

తెలంగాణలో మరో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు తిరగక నానా కష్టాలు పడుతున్న జనానికి కాస్త ఇబ్బంది కలిగించే వార్తే. గత కొంత కాలంగా డిమాండ్ ల పరిష్కారానికి ఎంతలా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా 108 సిబ్బంది సమ్మె బాట పట్టారు. అత్యవసర వైద్యసేవలు అందించే 108 అంబులెన్స్‌కు సంబంధించిన ఉద్యోగులు ఈ రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చిన 108 సిబ్బంది సమ్మె అనివార్యమైందని వెల్లడించింది. దీంతో  అత్యవసర సేవలను అందిస్తున్న 108 వైద్యసేవలునిలిచిపోనున్నాయి.  

సమ్మెపై ఉద్యోగులతో జీవీకే సంస్థ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఆ తర్వాత జీవీకేతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి సమ్మె నిలుపుదలకు ప్రయత్నించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కార్మికశాఖ ద్వారా చర్చలు జరపాలని ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత తమది కాదని, జీవీకేనే నియమించుకున్నందున తమకు సంబంధంలేదన్న వైఖరితో సర్కారు ఉంది. మరోవైపు జీవీకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. వేతనాలు, ఉద్యోగభద్రత వంటి 15 డిమాండ్లతో ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు వెళ్తున్నారు. ‘108’ వైద్యసేవల కోసం 1,800 మంది ఉద్యోగులు ఉండగా, 316 అంబులెన్స్‌లున్నాయి ఆ వాహనాలకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. సమ్మెకాలంలో జీవీకేకు సహకరించకుండా చూడాలని క్యాబ్, ఆటో ఇతర డ్రైవర్ల యూనియన్లను తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం  కోరింది.ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు తలనొప్పిగా మారిన ఆర్టీసీ సమ్మెకు తోడుగా మరో సమ్మె కొత్త తలనొప్ప తయారైంది. అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు ఉండవు అని ముందు నుండి చెబుతూ వచ్చిన కేసీఆర్ మరి ఇప్పుడు సమ్మె సైరన్ లపై మాత్రం మాట్లాడటం లేదు. అయినా అధికారంలో ఉంటే కదా పరిస్థితి ఎలా ఉంటుందొ తెలుస్తుందని కొందరు కేసీఆర్ను వెనకేసుకొస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Emergency  Service  108  ambulance  GVK  Govt  

Other Articles