Telangana | KCR | Delhi

Telangana cm k chandrashekar rao went to delhi to discuss about secretariate and some other issues

Telangana, KCR, Delhi, Defence minister, ome minister, Seretariate, Chest Hospital

Telangana cm k.chandrashekar rao went to delhi to discuss about secretariate and some other issues. KCR today meet central defence minister, home minister.

ఢిల్లీకి కేసీఆర్.. నేడు కేంద్ర రక్షణ, హోంమంత్రులతో భేటీ

Posted: 05/07/2015 08:08 AM IST
Telangana cm k chandrashekar rao went to delhi to discuss about secretariate and some other issues

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిన్న రాత్రి ఢిల్లికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా వెళ్లారు. సీఎం కేసీఆర్‌ నాలుగు రోజుల పాటు ఢిల్లిలోనే ఉండే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన విజ్ఞాపనలు, వాటి పురోగతిపై ఆరా తీయనున్నారు. రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ను కలిసి సచివాలయం కోసం సికింద్రాబాద్‌ లోని వివిధ స్థలాలపై చర్చించనున్నారని సమాచారం. అయితే ముఖ్య మంత్రి పర్యటనలో అత్యంత కీలకమైన భేటీ ఇదేనని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌ సచివాలయాన్ని ప్రస్తుతం ఉన్నచోటి నుంచి మార్చాలని భావిస్తున్న విషయం తెల్సిందే. మొదట ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి వద్దకు మార్చాలని భావించినప్ప టికీ సాంకేతిక కారణాల వల్ల అక్కడ కాకుండా సికింద్రాబాద్‌కు తరలిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిం ది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా, బైసన్‌ పోలో మైదానాలు అనుకూలంగా ఉన్నాయని అధికారులు నివేదిక రూపొందించారు. కాగా అవి రక్షణశాఖ ఆధీనంలో ఉండటంతో ఆ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే.. బదులుగా మరోచోట స్థలం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధంచేసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రక్షణమంత్రికి వివరించనున్నారని సమాచారం. అదేవిధంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియా తరలింపు అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. గతంలో శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్‌.. నగరం విస్తరించడంతో ప్రస్తుతం నగరం మధ్యకు చేరింది. దీనితో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లనున్నారని సమా చారం. కేంద్రం అనుమతిస్తే కంటోన్మెంట్‌ మరో చోటకు తరలింపునకు అవసరమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేయనున్నారు. తెలంగాణలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు, స్మార్ట్‌ సిటీలు తదితర అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైనిక్‌స్కూల్‌ ఏర్పాటు విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఈసారి వరంగల్‌కు సైనిక్‌స్కూల్‌ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లికి చేరుకోగానే ముందుగా పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. గురువారం ముందుగా కేంద్ర రక్షణశాఖ మంత్రిని కలవడంతోపాటు పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 కింద ఇంకా అమలుకు నోచుకోని అంశాలపై ఆయనతో చర్చించనున్నారని సమాచారం. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడును ఆయన నివాసానికి వెళ్లి కలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్‌సిటీల ఏర్పాటు, స్వచ్చ్‌భారత్‌ అంశాలపై చర్చించనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Delhi  Defence minister  ome minister  Seretariate  Chest Hospital  

Other Articles