Chandrababu, Special status, Central govt, Fund

Chandrababu naidu demand for special status ans more fund for andhrapradesh

Chandrababu, Special status, Central govt, Fund

Chandrababu naidu demand for special status ans more fund for andhrapradesh. Narachandrababu naidu central govt has to give more fund to develope andhra pradesh.

హోదా కాదు.. నిధులు కూడా ఇవ్వాలి: చంద్రబాబు నాయుడు

Posted: 05/07/2015 07:57 AM IST
Chandrababu naidu demand for special status ans more fund for andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ప్రకటిస్తే సరిపోదని, హోదాతోపాటు రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన నిధులు కూడా కేంద్రం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన విభజన హేతుబద్ధంగా లేని కారణంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని, మానసికంగా కూడా నష్టం కలిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన తీరుతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, తనపై నమ్మకంతో అధికారం అప్పగించారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాష్ట్ర అభివృద్ధికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో వివిధ అంశాలలో పోటీ పడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఆ రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు ఇబ్బంది లేకుండా చట్టంలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో కేంద్రం అన్నింటినీ అమలు చేయకపోయినా కొన్నింటిని మాత్రం పూర్తి చేసిందని ఆయన తెలిపారు.

విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సింది చాలా ఉంది, కేంద్రం ఇవ్వాల్సిందికూడా చాలా ఉందని అన్నారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ప్రైయివేటు రంగంలోకన్నా అత్యధిక వేతనాలు లభిస్తున్నాయని, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. అయినా కూడా కొందరు అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెబుతూ ఇది బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించారు. గతంలో తాను వస్తున్నానంటేనే అధికారులు, సిబ్బంది హడలెత్తిపోయేవారని, కానీ ప్రస్తుతం తాను సుహృద్భావ ధోరణితో అందరితో కలిసి పనిచేయాలని భావిస్తున్నానని చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు తేలికగా తీసుకొని విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Special status  Central govt  Fund  

Other Articles