RTC | Attacked | Private drivers,

Rtc employees attacked on private drivers in karimnagar and warangal

RTC, Attacked, Private drivers, karimnagar, Hanmakonda, Warangal

RTC employees attacked on private drivers in karimnagar and warangal. RTC employees strike getting violence, in warangal and karimnagar rtc employees attacked on private drivers who trying to drive the rtc buses.

ఆర్టీసీ సమ్మెలో ఉద్రికత్త.. ప్రైవేట్ డ్రైవర్ లపై కార్మికుల దాడి

Posted: 05/06/2015 10:08 AM IST
Rtc employees attacked on private drivers in karimnagar and warangal

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం  ప్రైవేట్ వ్యక్తులను తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ లుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ కు వెయ్యి రూపాయలు, కండక్టర్ కు ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో హెవీ లైసెన్స్ ఉన్నవాళ్లు,  పదో తరగతి అర్హత కలిగిన వాళు డిపోలకు పరుగులు తీస్తున్నారు. అయితే డిపోల వద్ద మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అక్కడికి వస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై వారు దాడులకు దిగుతుండటం ఉద్రిక్తతకు దారి తీస్తోంది. పోలీసులు అక్కడ ఉన్నా కూడా ఆర్టీసీ కార్మికులు వారిపై దాడి చెయ్యడం, వారిని అక్కడి నుండి పంపించెయ్యడం జరుగుతోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్లను అడ్డుకోవడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు యత్నిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో నిలిచిపోయిన బస్సులను ప్రైవేటు వ్యక్తులతో నడపడానికి అధికారులు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.ప్రైవేటు డ్రైవర్లు నడుపుతున్న వాహనాలను అడ్డుకునే యత్నం చేశారు. డిపో నుంచి బస్సును బయటకు తీస్తున్న ప్రైవేటు డ్రైవర్‌పై దాడికి దిగి అతన్ని గాయపర్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క కరీంనగర్ లోనే కాదు వరంగల్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హన్మకొండ డిపో వద్దకు ప్రైవేట్ డ్రైవర్ గా చేరదామని వచ్చిన వ్యక్తిపై అక్కడి కార్మికులు దాడి చేశారు. మరి ఆర్టీసీ వాళ్లు బస్సులు నడపక, వేరే వాళ్లను నడపనివ్వక తీవ్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు దాడులు చెయ్యడంపై విమర్శలు వస్తున్నాయి. శాంతి యుతంగా పమ్మె చెయ్యాలి తప్పితే హింసకు తావివ్వకూడదని హితవు పలుకుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Attacked  Private drivers  karimnagar  Hanmakonda  Warangal  

Other Articles