Private, Travels, TC strike, Fare, bund,

Private travels collecting more than double on normal fare

Private, Travels, TC strike, Fare, bund,

Private travelles, auto taxis demanding more on rtc strike. travels collecting more than double on normal fare.

సమ్మెతో ప్రైవేట్ దోపిడీ షురూ.. జేబుకు చిల్లే

Posted: 05/06/2015 09:38 AM IST
Private travels collecting more than double on normal fare

తెలుగు రాష్ట్రాల్లో బస్సులు రోడ్డక్కెలేదు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇల్లు కాలుతుంటూ చుట్ట వెలుగించుకోవడానికి అగ్గి అడిగిన చందంగా ఆర్టీసీ సమ్మెను కొంత మంది ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అందిన కాడికి దండుకుంటున్నాయి. ఆటోలు, ప్రైవేట్ బస్సులు, టాక్సీలు ఇలా అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ జనాల రక్తాన్ని పీలుస్తున్నాయి. హైదరాబాద్ , వరంగల్ లాంటి నగరాల్లో ఆటో చార్జిలకు రెక్కలు వచ్చాయి. ఎంత ఖర్చైనా పర్లేదు అని .జనం.. అందినంత దోచుకోవాలని ఆటొ డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తున్నారు. అయితే సామాన్యుడి పరిస్థితే దారుణంగా మారింది. అసలే పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు.

హైదరాబాద్ సిబియస్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకు మామూలుగా అయితే బస్సైతే 12 రూపాయలు, మామూలు టైంలో ఆటో 50 రూపాయలు తీసుకుంటారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా 50 రూపాలయ స్థానంలో ఏకంగా 400 నుండి 500 వరకు డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్క హైదరాబాద్ లోనే కాదు అన్ని తెలంగాణ, ఏపిలో బస్సులు తిరగక, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడిని తట్టుకోలేక దిగాలు పడుతున్నారు జనం. కాగా ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వ్యక్తుల సహాయంతొ నడిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా, పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్టీసీ సమ్మెతో ఎంఎంటీఎస్, సెట్విన్ బస్సులు ఫుల్ అవుతున్నాయి. ఇసుకేస్తే కిందికి జారని పరిస్థితి ఏర్పడింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Private  Travels  TC strike  Fare  bund  

Other Articles