TRS, High court, Parliament, Vinod, Telangana, AP

Trs mps demanding for seperate high ourts for each states

TRS, High court, Parliament, Vinod, Telangana, AP

TRS mps demanding for seperate high ourts for each states. Telangana govt also demanding for high court seperation. TRS Mps questions on high court at parliament.

ప్రత్యేక హైకోర్ట్ పై పార్లమెంట్ లో రగడ

Posted: 05/05/2015 03:43 PM IST
Trs mps demanding for seperate high ourts for each states

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైకోర్టు విభజన గురించి గత కొంత కాలంగా పేచీ నడుస్తోంది. అయితే ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు వేరువేరు హైకోర్టులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ముందు నుండి డిమాండ్ చేస్తోంది. కాగా తాజాగా ఉమ్మడి హైకోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఏపి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యే వరకు రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్ట్ కొనసాగుతుందని హైకోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్ట్ అంశాన్ని పార్లమెంట్ లో తేల్చుకొవాలని నిర్ణయం తీసుకుంది.

హైకోర్టును ఎప్పుడు విభజిస్తారో స్పష్టం చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పట్టుపట్టారు. దీనికి సంబంధించి న్యాయశాఖ మంత్రిగానీ, హోంశాఖ మంత్రిగానీ వివరణ ఇవ్వాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. అయితే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, ఈ అంశం న్యాయస్థానంలో విచారణలో ఉండడంవల్ల విభజన ప్రక్రియ ఆలస్యం అవుతుందని న్యాయశాఖమంత్రి సదానందగౌడ వివరణ ఇచ్చారు. మంత్రి వివరణపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మేం న్యాయపోరాటం చేస్తున్నామని అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కేంద్రం నిజాయితీగా ప్రయత్నిస్తోందని అన్నారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ఎంపీలతోనూ ఈ అంశంపై చర్చ జరిగిందని మంత్రి తెలిపారు దురదృష్టవశాత్తూ మధ్యలో ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో పిల్‌ దాఖలైందని, దాంతో మా చేతులు బిగుసుకుపోయాయని, అందుకే నేను ఎలాంటి ప్రకటన చేయలేకపోతున్నానని ఆయన చెప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  High court  Parliament  Vinod  Telangana  AP  

Other Articles