TDP minister got 20 crores from Agrigold

Devineni nehru rajasekhar takes on tdp leaders

TDP minister got 20 crores from Agrigold, Devineni Nehru, Congress leader Devineni Nehru, Devineni Nehru On Agrigold, Agrigold Loans, Agrigold victims, CBI, TDP MLA., TDP minister, Devineni Nehru allegations on tdp,

APPCC Sub Head Devineni Nehru gave serious allegations on TDP MLAs in Vijayawada today. He said One of the TDP MLA from East Godavari got about 20 crores of Bride regarding this Agrigold issue.

అగ్రీగోల్డ్ వ్యవహారంలో ముడుపులు.. అయన వెంట ఆర్థిక నేరగాళ్లు..

Posted: 05/05/2015 03:08 PM IST
Devineni nehru rajasekhar takes on tdp leaders

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి చైనా వెళ్లిన వారిలో 10 మంది ఆర్థిక నేరస్తులు ఉన్నారని కాంగ్రెస్‌ నేత దేవినేని నెహ్రూ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్తులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి చంద్రబాబు రాష్ట్ర పరువు తీశారని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తుల చరిత్రను త్వరలో సాక్ష్యాధారాలతో బయటపెడతానని నెహ్రూ తెలిపారు. ప్రస్తుతానికి కొంత మంది వివరాలు సేకరించగలిగామని చెప్పారు. ఆర్థిక నేరస్తులను తీసుకెళ్లి పెట్టుబడులు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు.
 
మరోవైపు అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ అమాత్యుడికి 20 కోట్ల రూపాయలు ముడుపులు అందాయని దేవినేని నెహ్రూ అన్నారు. అందుకే సదరు మంత్రిగారు బాధితుల తరఫున నోరు మెదపడం లేదని విమర్శించారు  అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో, విమానాశ్రయాల పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రైతులను అండగా ఉంటామని దేవినేని నెహ్రూ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devineni Rajasekhar  congress leader  tdp leaders  

Other Articles