assistant professor in brothel house, arrested

Police arrested assistant professor who caught in brothel house

assistant professor in brothel house, police arrested assistant professor, prostitution, assistant professor, assistant professor caught in brothel house, assistant professor surender reddy, khairathabad degree collage, surender reddy,

police arrested assistant professor surender reddy, who caught in brothel house

ఆ మాస్టారును కలవాలంటే... అక్కడికే వెళ్లాలి

Posted: 05/05/2015 03:25 PM IST
Police arrested assistant professor who caught in brothel house

నగరంలోని ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ లో అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గా పనిచేస్తున్న సురేందర్ రెడ్డి మాస్టారును కలవాలంటే.. ఎక్కడికి వెళ్లాలి.. కాలేజీకో లేక ఇంటికో అనుకుంటున్నారా.. ఎంత మాత్రం కాదు. ఎందుకంటే వేసవి కాలం.. అందులోనూ కళాశాలలకు సెలవు.. ఇప్పుడు చెప్పండి.. ఈ మాస్టారును కలవాలంటే చైతన్యపురిలోని ఆ వ్యభిచార గృహానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆయన అక్కడే దోరికారు కాబట్టి. డిగ్రీ విద్యార్థులను సక్రమ బాటలో నడిపి వారిని ప్రయోజకులుగా చేయాల్సిన మాస్తారు.. ఇలా అడ్డంగా బుకయ్యారు. హైదరాబాద్లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో వ్యభిచార గృహ నిర్వాహకుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న ఒక మహిళతో పాటు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడిని, ఒక మహిళ, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా విటుడు నగరంలోని ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉజ్వల కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.15,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution  assistant professor  surender reddy  arrest  

Other Articles