MP Actor Murali Mohan Rejected to pay his star hotels bills which is conduct by Central Govt as ReEmbursement Scheme

Mp actor murali mohan reject central govt reembursement scheme

Murali Mohan News, Murali Mohan updates, Murali Mohan controversy, central govt news, re embursement scheme, Murali Mohan Schemes, Murali Mohan Govt Fight

MP Actor Murali Mohan Reject Central Govt ReEmbursement Scheme : MP Actor Murali Mohan Rejected to pay his star hotels bills which is conduct by Central Govt as ReEmbursement Scheme

బాగానే అనుభవిస్తున్నారు.. కానీ ‘ససేమిరా’ అంటున్నారు!

Posted: 05/04/2015 01:58 PM IST
Mp actor murali mohan reject central govt reembursement scheme

ఎంపీలుగా గెలుపొందిన పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ప్రత్యక వెలుసుబాటులు కల్పిస్తుంది. బస చేయడానికి స్టార్ హోటళ్లు, అనుభవించడానికి ఎన్నో వసతులతోపాటు ఖర్చులకు ఏమాత్రం తావులేకుండా డబ్బులు కూడా వెచ్చిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే.. కేంద్రప్రభుత్వం వీరిని రాజుల్లాగా భావిస్తూ అన్నీ సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తోంది. అయితే.. అదే కేంద్రం విధించిన కొన్ని నియమనిబంధనలను పాటించే సమయం వస్తే.. అందుకు కొందరు ససేమిరా అంటున్నారు. అటువంటివారి జాబితాలో వున్న వారిలో మురళీమోహన్ పేరు ప్రస్తుతం ముందుగా వినిపిస్తోంది.

ఇన్నాళ్లూ స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన సౌకర్యాలను అనుభవించిన ఎంపీలందరూ వసతి చెల్లింపులు చేయాలని ఇటీవలే కేంద్రం ఓ ప్రణాళికను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎంపీలందరూ వసతి చెల్లింపులు చేసి.. తిరిగి ఆ డబ్బును కేంద్రం నుంచి రీయింబర్స్ మెంట్ విధానం ద్వారా పొందవచ్చు. అయితే.. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెను వివాదమే చెలరేగింది. ఇందుకు కొందరు ఎంపీలు సుముఖుత వ్యక్తం చేసి సదరు ఖర్చులను హోటళ్లకు చెల్లించి, సర్కార్ నుంచి రీయిబర్స్ మెంట్ కు సిద్ధపడ్డారు. కానీ.. మరికొందరు మాత్రం ఇలా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు-నటుడు మురళీమోహన్ మాత్రం ఈ వ్యవహారంపై వితండవాదం చేస్తున్నారు. తాను హోటళ్లకు ఖర్చులు చెల్లించేది లేదంటూ బిగదీసుకుని కూర్చున్నారు.

అంతేకాదు.. ఎంపీలుగా మాకు ఆ మాత్రం వసతులు కూడా అవసరం లేదా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. రీయింబర్స్ మెంట్ ను తాను అవమానకరంగా పరిగణిస్తానని ఆయన పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సభ్యులు ఫ్లాట్ ఫాంలపై వుండా’ అంటూ తనదైన శైలిలో నిరసన గళం విప్పారు. మరి.. ఈయన వ్యవహారంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali Mohan  Central Govt Schemes  

Other Articles