Nepal | earthquake | media

Nepalese slam indian media gohomeindianmedia trends

Nepal, earthquake, media, india, twitter

As Nepal picks up pieces in the aftermath of last month's devastating earthquake that killed over 7,000 people and injured more than 14,000, some have picked holes in the "relentless and aggressive" coverage by the Indian media.

మీడియా వాళ్లు ఇక చాలు వెళ్లిపోండి అంటున్న నేపాల్

Posted: 05/04/2015 02:43 PM IST
Nepalese slam indian media gohomeindianmedia trends

నేపాల్ భారీ భూకంపంతో అతలాకుతలమై, ఎన్నో వేల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. అయితే నేపాల్ ఘనటకు కవర్ చెయ్యడానికి దేశ, విదేశ మీడియా సిబ్బంది హుటాహుటిన నేపాల్ కు చేరుకున్నాయి. అయితే నేపాల్ లో పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు ప్రపంచానికి చేరవేసిన మీడియా మిత్రులపై అక్కడి వారు కాస్త గుర్రుగా ఉన్నారు. చాలు బాబు చాలు.. చేసింది చాలు ఇక వెళ్లిపోండి మా బాధలేవో మేం పడతామని అంటున్నారు నేపాలీలు. ఇంకీ విషయం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడి వారి సొంత పనులు కూడా చేసుకోవడానికి వీలులేనంతగా మీడియా వారు హడావిడి చేస్తున్నారు మరి. అక్కడ సహాయ సిబ్బంది కన్నా మీడియా సిబ్బంది చేస్తున్న అతి వారికి చాలా చిర్రాకు తెప్పిస్తోంది.

అయితే తాజాగా ట్విట్టర్ లో స్టార్ట్ చేసిన గో హోమ్ ఇండియన్ మీడియా(#GoHomeIndianMedia) పేజికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. చాలా మంది మీడియా వారికి ధన్యవాదాలు కానీ ఇప్పటికి మా దేశం వదిలి వెళ్లిపోండి అని కోరుకుంటున్నారు. ఇండియన్ మీడియాకు కనీస విలువలు లేవని, మానవత్వానికి విలువ ఇవ్వడం లేదని నేపాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 వేల మంది ఇండియన్ మీడియాను దేశం వదలాలని ట్విట్ చెయ్యడం విశేషం. పాపం వారిని ఎంత విసిగిస్తే మాత్రం ఇలాంటి మాట అంటారు చెప్పండి.

      A tweet from a person followed by Indian Embassy Kathmandu shows how serious the matter is #GoHomeIndianMedia pic.twitter.com/2i5s2Zd2KF
    — I Blocked Aajtak (@umeshd516)

    Stop your Media-quake!! We are already in pang by devastating Earthquake and your news are not helping the victims!! #GoHomeIndianMedia
    — सूचना घिमिरे ツ (@artless77)

    Dear Indian media, we shall welcome you back once you learn the basics and ABCs of journalism. For now leave. #GoHomeIndianMedia
    — prakriti khadka (@khadka_prakriti)

    #GoHomeIndianMedia @aajtak @abpnewstv @IndiaToday Mr. @narendramodi please call your media back. They r just hurting us more
    — लुरे (Nishan Aryal) (@fantastic_fan)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  earthquake  media  india  twitter  

Other Articles