Jayaprakash| NTR Stadium| | Kalabharati

Jayaprakash fire on telangana govt decision to construct kalabharathi in ntr stadium

Jayaprakash, NTR Stadium, Hyderabad, Kalabharati

Jayaprakash fire on telangana govt decision to construct kalabharathi in ntr stadium. Telangana govt proposed to construct kalabharathi in ntr stadium, hyderabad. Jp and many others oppose the ts govt decision.

కోపమొచ్చింది.. ఏకంగా శుంఠల్లారా అని అన్నాడు.. అంతే

Posted: 05/04/2015 01:37 PM IST
Jayaprakash fire on telangana govt decision to construct kalabharathi in ntr stadium

ఆయన మేధావి.. ఎంతో మంచి పేరున్న నాయకుడు. దాదాపు అన్ని అంశాలపై అవగాహన ఉన్న నేత. కానీ అప్పడప్పుడు కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు కాస్త ర్యాష్ గా మాట్లాడుతుంటారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని అనుకుంటున్నారా.. లోక్ సత్తా నేత జయప్రకాశ్. అవును జయప్రకాశ్ కాస్త నోరు జారారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్టీఆర్ స్టూడియం స్థానంలో అతిపెద్ద కళాభారతిని కట్టాలని, ఇందిరా పార్క్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తామన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుంఠల్లారా అర్థం చేసుకోండి. మా పన్నుల డబ్బులతో బతుకుతున్నారు. మాకు సేవ చేయటానికి మీరు ఎంపికయ్యారు. మీకోసం మేం కాదు.. మాకోసమే మీరున్నారు. అధికారులు గుర్తించాలి. అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలనుంచి ప్రతిఘటన ఎదురవటం ఖాయం అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తానికి జెపిగారి మాటలు కాస్త కఠువుగా ఉన్నాయి కానీ పాపం తన తాపత్రయం అంతా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై అంటున్నాడు.

జెపి మాటల్లో కొన్ని..
*మూర్ఖులైన అధికారులు రాజును మించి రాజభక్తిని చూపిస్తూ పాలకులను తప్పుదోవ పట్టిస్తున్నారు
*లంచాలు తీసుకొని బొజ్జలు పెంచుకుంటున్నారు
*మా ఆటస్థలాల జోలికి రాకండి. కబ్జాస్థలాలు విడిపించి కళాభారతి కట్టండి, ఇందిరాపార్కు పచ్చదనం మా హక్కు దానిని వినాయకసాగర్‌గా మార్చకండి.
*కేసీఆర్‌, మీరు మహారాజు కాదు. గతంలో మిమ్మల్నీ.. అరెస్టు చేశారు, లాఠీ దెబ్బలు కొట్టారు, మంచికో చెడుకో మంచి చేస్తారనే నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చో బెట్టారు
*కేసీఆర్‌.. ప్రపంచంలోనే.. ఎత్తైన భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. దుబాయ్‌కంటే పెద్ద భవనాలు నిర్మిస్తే సంతోషిస్తాం.
*హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌కు వెళితే సాగర్‌ నీటిలో మునిగిపోయి చనిపోవడం కంటే ముందే.. విష జలాల మురికి వాసనకే చనిపోతారు
*ఎండాకాలంలో ఐదు నిమిషాలు వర్షం పడితే వరదలొస్తున్నాయి.
*మెట్రోకు అడ్డుపడింది మీరు, అభివృద్ధికి అడ్డుపడింది మీరు. హైదరాబాద్‌ నగరంలో కొన్ని వేల ఎకరాల్లో భూకబ్జాలు జరుగుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayaprakash  NTR Stadium  Hyderabad  Kalabharati  

Other Articles