Telangana | Insurance | Farmers | Agriculture

Telangana cm kcr assurance that insurance for farmers

Telangana, Insurance, Farmers, Agriculture, Nagarjunasagar

Telangana cm kcr assurance that insurance for farmers. telangana cm kcr participating in special classes at nagarjunasagar. In this sessions kcr cleared that famers will get insurance soon.

తెలంగాణ రైతులకు భీమా ధీమా

Posted: 05/04/2015 09:04 AM IST
Telangana cm kcr assurance that insurance for farmers

రాష్ట్రంలో వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టంచేశారు. దళితులు, పేదలకు ఉచితంగా మంచినీటి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలపాటు తాగునీటిని సరఫరా చేయాలనే ఆలోచన కూడా ఉందని తెలిపారు. పోలీసుల పనివిధానంలో రాజకీయ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమమని సీఎం అభిప్రాయపడ్డారు. బడ్జెట్ రూపకల్పనపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరగాలని, అప్పుడే ప్రజాప్రతినిధులందరి భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.

నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతులలో రెండో రోజు వ్యవసాయం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్టసభలు, పట్టణాభివృద్ధి, శాంతిభద్రతలు అనే అంశాలపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. వారు మాట్లాడే సమయంలో సీఎం కేసీఆర్ సందర్భోచితంగా చొరవ తీసుకొని వివిధ అంశాలపై వివరణలు ఇవ్వడంతోపాటు కొన్ని ప్రకటనలు చేశారు. భవిష్యత్ లక్ష్యాలను, రానున్న కాలంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతినిధులు ఆసక్తిగా చర్చల్లో పాల్గొంటుండటంతో షెడ్యూలుకన్నా అదనపు సమయం తరగతులు కొనసాగుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Insurance  Farmers  Agriculture  Nagarjunasagar  

Other Articles