Telangana, Land, Landless, Poor, Distribution

Telangana govt collecting land to distribute

Telangana, Land, Landless, Poor, Distribution

Telangana govt collecting land to distribute. telangana govt plans to give land for landless poor. TS govt collected two thousand four hundred acers.

భూపంపిణికి తెలంగాణ సర్కార్ కసరత్తు

Posted: 05/04/2015 09:12 AM IST
Telangana govt collecting land to distribute

భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలను రైతులుగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భూపంపిణీ పథకం రెండోదశ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమిలేని ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వటంతోపాటు దానికి సాగునీటి సౌకర్యం కూడా కల్పించే ఈ కార్యక్రమం కింద మొదటి దశలో ఇప్పటికే 2400 ఎకరాలకు పైచిలుకు భూమిని హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో దాదాపు వెయ్యిమంది లబ్ధిదారులకు పంచారు. రెండోదశలో పంచేందుకు నాలుగువేల ఎకరాల భూమిని అధికారులు సిద్ధంచేశారు.

మొదటిదశ పంపిణీ సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఆసరా, సమగ్ర కుటుంబ సర్వే, ఆహార భద్రత కార్డులపై దృష్టి పెట్టడంతో ఈ పథకం కొంత నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెలలోపే ఈ పథకం కోసం నాలుగువేల ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన 7 జిల్లాల్లో రైతులతో అధికారులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మే ఒకటో తేదీనాటికి నాలుగువేల ఎకరాల పైచిలుకు భూ యజమానులతో చర్చించారు. భూమి కొనుగోలుకు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసార పరీక్ష, భూగర్భజల పరీక్ష, న్యాయపరమైన అంశాలు, ఇతరాలను పరిశీలిస్తున్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూముల కొనుగోలుకు సుముఖత వ్యక్తంచేశారు. భూసార, భూగర్భ జల పరీక్షల నివేదికలు రాగానే మిగిలిన భూములను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Land  Landless  Poor  Distribution  

Other Articles