Telangana, Notifications, Jobs,

Telangana govt getting ready to release notifications for jobs

Telangana, Notifications, Jobs,

Telangana govt getting ready to release notifications for jobs. After telangana state farmation govt getting ready to release the new notifications for dist. level jobs.

ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్

Posted: 05/04/2015 08:00 AM IST
Telangana govt getting ready to release notifications for jobs

నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నిస్తూ సాగిన ఉద్యమఫలంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో.. కీలకమైన ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌కు అవసరమైన 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్, రోడ్లు భవనాలశాఖలో పదవీ విరమణ చేసినవారితోపాటు ఖాళీలను కలుపుకొని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్న 1300 ఉద్యోగాలను ప్రభుత్వం గుర్తించింది. వీటి భర్తీ కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయా శాఖల అధిపతుల నుంచి త్వరలోనే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఆర్థిక శాఖ అనుమతి పొందిందే తడవుగా టీఎస్‌పీఎస్సీ ద్వారా గానీ, అనుమతి పొందిన శాఖల నియామక విభాగాల ద్వారా గానీ, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఉద్యోగుల విభజన కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలనాథన్ కమిటీ తుది నివేదికను ఇప్పటికీ ఇవ్వలేకపోవడం, కీలకమైన హెచ్‌వోడీల విభజన జరగకపోవడం, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఖాళీల భర్తీ తేలకపోవడంతో ఉద్యోగాల భర్తీ ఆలస్యం అయింది. అయినప్పటికీ ఉద్యోగార్థులను నిరీక్షణలో ఉంచకుండా ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొందరలోనే జిల్లా స్థాయి ఉద్యోగాలు అన్నింటిపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని, తొందరలోనే ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ రావచ్చిన అధికార వర్గాలు వెల్లడించాయి. మరి నిరుద్యోగులారా నోటిఫికేష్ లు వస్తున్నాయి.. పరీక్షలకు సిద్దంకండి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Notifications  Jobs  

Other Articles