mountaineer nilema experiences on nepal earth quake

Mountaineer nilema on nepal earth quake

mountaineer nilema on nepal earth quake, Andhra pradesh mountaineer nilema, nilema experiences on nepal earth quake, nelima ultimate goal is to Trek everst,

Andhra pradesh mountaineer nilema experiences nepal earth quake on everst, says her ultimate goal is to Trek everst

ఎవరెస్టును అధిరోహించడమే లక్ష్యమన్న నీలిమా

Posted: 05/01/2015 04:45 PM IST
Mountaineer nilema on nepal earth quake

నేపాల్‌ భూకంపం నుంచి బయట పడటం అదృష్టమని పర్వతారోహకురాలు, తెలుగమ్మాయి నీలిమ అన్నారు. భూకంప ప్రమాదం నుంచి నీలిమ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఎవరెస్ట్‌ అధిరోహణకు వెళ్లి భూకంప ధాటికి అష్టకష్టాలను ఎదుర్కున్న నీలిమ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. భూకంప సమయంలో ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌కు దగ్గర్లో తాము ఉన్నామని తొలుత తమకు అర్థకానప్పటికీ భూకంపం అని గుర్తించాక కమ్యూనికేషన్‌ లేకుండా పోయిందన్నారు. ఎవరెస్ట్‌కు దాదాపు 4600 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు భూకంపం వచ్చిందన్నారు.

తాము ట్రెక్కింగు వెళ్లేప్పుడు ఆహ్లాదంగా ఉన్న పరిసరాలు తిరిగి వస్తుండగా భూకంపం ధాటికి పరిసరాలు, రవాణా వ్యవస్థ, రోడ్లు పూర్తి ధ్వంసమయ్యాయన్నారు. భారీ భూకంపం అనంతరం వచ్చిన ప్రకంపనలతో నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. నేపాల్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ సేవలు అద్భుతమని కొనియాడారు. మరణం ఎక్కడున్నా వస్తుందని.. దానికి తానెప్పుడూ భయపడబోనని చెప్పారు. ఎప్పటికైనా ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమని పర్వతారోహకురాలు నీలిమ స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nilema  mountaineer  Mt. everst  

Other Articles