Petrol Prices Hiked by Rs. 3.96 a Litre, Diesel by Rs. 2.37

Petrol diesel prices hiked

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

After two rounds of cuts, petrol prices were raised by Rs 3.96 per litre and diesel by Rs 2.37 a litre, tracking global cues.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. వాహనదారుల జేబులకు చిల్లులు..

Posted: 05/01/2015 04:43 PM IST
Petrol diesel prices hiked

పెట్రోల్‌, డీజిల్ సహా చమురు దరలకు వేసవి మంట కూడా తగిలిందనుకుంటా. వాటి ధరలు వినడంతోనే భగ్గుమనే రోజులు మళ్లీ వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు దరలకు రెక్కలు రావడంతో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ మాసాంతం నాటికి చమురు దరలు అంతర్జాతీయ మార్కెట్లో ఆరు మాసాల గరిష్ట స్థాయికి చేరాయి. దీంతో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.96, డీజిల్‌పై రూ.2.37 చొప్పున ధరలు పెంచుతున్నట్లు ఇంధన కంపెనీలు ప్రకటించాయి. తాజా రేట్లు అములుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ.59.20 నుంచి రూ. 63.16కు పెరగింది. డీజిల్‌ ధర రూ.47.20 నుంచి రూ.49.57కు పెరగింది.

గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ క్రమంగా తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు మొత్తంగా  పది సార్లు తగ్గింపులతో పెట్రోల్‌ రూ.17.11, డీజిల్‌ రూ.12.96 మేర తగ్గాయి. అయితే.. ఆ తరువాత మార్చి ఒకటో తేదీన పెట్రోల్‌పై రూ.3.18, డీజిల్‌పై రూ.3.09 చొప్పున పెంచా రు. రెండు వారాలకొకసారి జరిపే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు డిమాండ్‌ను బట్టి పెట్రో ధరల సమీక్షలో భాగంగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నట్లు భారత్‌లోని అతి పెద్ద ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ ద్వితీయార్థంలో డాలర్‌- రూపాయి మారకం విలువ అంతకు ముందు కంటే ఎక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణాల్లో ఒకటని చెప్పొచ్చు.

అయితే పెట్రోల్ ధరలు తగ్గడంతో ఎక్సైజ్ సుంఖాన్ని క్రమంగా పెంచుతూ పోయి ఏకంగా పది రూపాయల మేర పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుంఖం పన్నును తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంధనంపై వ్యాట్ ను గణనీయంగా పెంచిన ప్రభుత్వాలు కూడా వాటిని మినహాయిస్తే.. కొంత ఉపశమనం లభిస్తుందని వాహనదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol price  Petrol price hike  Diesel price hike  Fuel prices  Brent crude price  

Other Articles