Woman Allegedly Gang-Raped in Punjab's Moga Where Teen Was Molested, Thrown Off Bus

After teen molestation now young woman alleges gangrape in moga

moga, moga rape, punjab rape, moga molestation, parkash singh badal, badal molestation, badal bus, molestation bus, moga gangrape, molestation in Punjab, Molestation, Moga molestation, Punjab, nation, Crime, "Sukhbir Badal,Moga civil hospital, Girl,14, dies, mother seriously injured, victims thrown, moving bus, India, gang, passengers, conductor, sexually, assaulted, Mayawati, prakash singh badal, moga bus incident, girl thrown off bus,

A young woman in Punjab’s Moga district has alleged that she was gang-raped by her friend’s husband and his friends, police said on Friday.

పంజాబ్ లో మరో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్

Posted: 05/01/2015 04:47 PM IST
After teen molestation now young woman alleges gangrape in moga

పంజాబ్ రాష్ట్రంలో అబలలపై దారుణాలు పెచ్చుమీరుతున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలికపై..తోటి ప్రయాణికులలోని మగమృగాళ్లు అత్యాచారానికి యత్నించి.. అందుకు సహకరించని చిన్నారి బాలికను కదులుతున్న బస్సు నుంచి తోసివేయడంతో మరణించిన ఘటన మరువక ముందే.. అదే రాష్ట్రంలో.. అదే ప్రాంతంలో మరో అబాగినిపై మగమృగాళ్లు పైశాచిక చర్యకు తెగబడ్డాయి. పంజాబ్ లోని మోగా జిల్లాలోనే ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో బాధితురాలి స్నేహితురాలి భర్త కూడా ఉన్నాడు.

పోలీసులు వివరాల ప్రకారం.. బాధితురాలు తన స్నేహితురాలిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లింది. స్నేహితురాలి కోసం  ఎదురుచూస్తుండగా అంతలో వచ్చిన ఆమె భర్త మరికొందరు కలసి అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. బాధితురాలు వారిని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా కొట్టి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు వివరాలు సేకరించిన పోలీసులు బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపించారు. ఆమె స్నేహితురాలు, భర్త మిగితావారిపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

సాక్షాత్తు.. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్ బీర్ సింగ్ బాదల్ లకు చెందిన కంపెనీ ఆర్బిట్ ఏవిషన్ సంస్థకు చెందిన బస్సులో ఘటన జరిగిన నేపథ్యంలో పెట్రోలింగ్ సహా బందోబస్తులను అప్రమత్తం చేయాల్సిన పోలీసులు.. ఒక ఘటన వెలుగుచూసిన తరువాత కూడా తమకు పట్టనట్టు మొద్దునిద్రను వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా, సదరు బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందని వైద్యుల ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నా.. పోలీసులు మాత్రం గ్యాంగ్ రేప్ జరగలేదని, బాధితురాలి పేరును మీడియా సమావేశంలో పలుమార్లు బహిర్గత పర్చడం వారి అకుంఠిత పనితీరుకు దర్పణం పడుతోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moga gangrape  molestation  Punjab  Crime  

Other Articles