modi govt another controversy.. gujarat lions to replace bengal tigers as national animals

Lion as national animal central panel mulls

Lion as national animal Central panel mulls, modi government another controversy, Lion to be India s National Animal? Modi Govt mulling to replace Tiger with king of jungle, Tigers, Asiatic lion, National Animal, Sunderbans, Gir forest, Ranthambore, Pench,Wildlife in India, Himalayas, gujarat lions to replace bengal tigers as national animals,

Bengal tiger is the present national animal of India and now Modi Government is trying to replace it with Gujarat's lion and this is irking the environmentalists.

మరో వివాదంలో మెదీ సర్కార్‌.. జాతీయ జంతువుగా గుజరాత్ సింహం.!

Posted: 04/19/2015 06:41 PM IST
Lion as national animal central panel mulls

మోదీ సర్కార్‌ మరో వివాదంలో చిక్కుకోనుంది. జాతీయ జంతువుగా పులి స్థానంలో సింహాన్ని తీసుకురావాలని భావిస్తోంది. బెంగాల్‌ టైగర్‌ను పక్కన పెట్టి, గుజరాత్‌ సింహాలకు మోదీ సర్కార్‌ పట్టం కట్టాలనుకుంటోంది. వివరాల్లోకెళితే.. సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జార్ఖండ్‌ ఎంపీ పరిమల్‌ నాథ్వాని పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన పంపించారు. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈ ప్రతిపాదనను వన్యప్రాణి సంరక్షణ బోర్డుకు పంపారు. అయితే ఈ బోర్డులో ఎక్కువ మంది గుజరాతీలే ఉన్న కారణంగా వారు కూడా జాతీయ జంతువుగా సింహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1972 నుంచి బెంగాల్‌ రాయల్‌ టైగర్‌ జాతీయ జంతువుగా ఉన్నదని, ఇప్పుడు హఠాత్తుగా పులిని ఎందుకు ఆ స్థానం నుంచి తప్పించాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పులులు దేశంలోని 17 రాష్ర్టాల్లో ఉన్నాయి. సింహాలు కేవలం గుజరాత్‌లో మాత్రమే ఉన్నాయి. అంతరించిపోయే జాబితాలో ఉన్న సింహాలకు జాతీయ హోదా ఎలా కల్పిస్తారని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పలుల సంరక్షణా కేంద్రాల దగ్గర పరిశ్రమల నిర్మాణానికి అనుమతినివ్వడం కోసమే మోదీ సర్కార్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi government  national animal  gujarat lions  bengal tigers  

Other Articles