six gang rape accused arrested in Warangal

Gangrape in warangal district

young girl gangraped in warangal, gangrape in Telangana, gangrape in cheryal, Kidnap, Rape, Police, Arrest, 18-year-old girl raped, accused lover and five arrested, maharanipeta, crime on women, violence on women, sexual harassment on girl, young girl raped, Gangrape, culprits arrested, crime in Telangana

A young girl aged around 20 years was sexually assaulted by a group of six persons in limits of cheryala police station.

వరంగల్ చెర్యాలలో ఘోరం.. ప్రేమ పేరుతో యువతిపై గ్యాంగ్ రేప్

Posted: 04/19/2015 05:50 PM IST
Gangrape in warangal district

వరంగల్ జిల్లా మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ యువతిని నిర్ఝన ప్రదేశానికి పిలిచిన యువకుడు.. అతని స్నేహితులతో కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటన చేశారే తప్ప ఆ దిశగా ఎలాంటి అడుగులు తీసుకోకపోవడంతో.. అదే అదనుగా అమ్మాయిలపై మగమృగాళ్ల అఘయిత్యాలు పెరుగుతూ పోతున్నాయి. చేర్యాలలో శనివారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా వున్నాయి.

బాధితురాలి ఇంటి సమీపంలో నివసించే ఓ యువకుడు... ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడు. ఆ క్రమంలో శనివారం రాత్రి తనతో మాట్లాడాలి అని చెప్పి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఐదుగురు యువకులతో పాటు సదరు యువకుడు కూడా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి పరారైయ్యారు. ప్రేమ పేరుతో పరిచయమైన యువకుడిదీంతో బాధితురాలు తల్లిదండ్రులతోపాటు ఆదివారం ఉదయం పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangrape  culprits arrested  crime in Telangana  

Other Articles