Parties | Mulayam | Janata pariwar

Six parties to merge under mulayam yadav as janata pariwar

janata pariwar, mulayam singh, jds, devegouda, laluprasad, chowthala

Six Parties to Merge Under Mulayam Yadav as Janata Pariwar. Janata Parivar merger meet is set for today on Wednesday and decided to work under the leadership of Samajwadi Party (SP) chief Mulayam Singh Yadav prior to Bihar and Uttar Pradesh Assembly Elections considering Nitish as CM.

జెండల జెండ కొత్త జెండా.. కానీ పాత అజెండా

Posted: 04/15/2015 01:26 PM IST
Six parties to merge under mulayam yadav as janata pariwar

కొత్త సీసాలో పాత సరుకు అన్న సామెతకు మారుతున్న రాజకీయాలకు బాగా అబ్బుతాయి. అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిని కాదని చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో ఆరు పార్టీలతో కూడిన జనతా పరివార్ నేడు ఆవిర్భవిస్తోంది. పలు రాష్ట్రాల అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాదే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.ములాయం నివాసంలో జరిగే ఈ సమావేశంలో కొత్త కూటమికి ఏ పేరుపెట్టాలి అన్నదానిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పార్టీ గుర్తుపైనా సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, జెడియు చీఫ్ శరద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి, జెడిఎస్ చీఫ్, మాజీ ప్రధాని దెవేగౌడ, ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ జనతా పార్టీ చీఫ్ కమల్ మొరార్క్, ఐఎన్‌ఎల్‌డి నేత దుశ్యంత్ చౌతాలాలతోపాటు ములాయం సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్ హాజరుకానున్నారు.

జనతా పరివార్ మహా కూటమికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రత్యేక భూమిక పోషిస్తారు. మంగళవారం సాయంత్రానికే కుమార్ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ‘జనతా పరివార్ కూటమికి సంబంధించి ఆరు పార్టీల నాయకులు ఈపాటికే పలుదఫాలు చర్చించుకున్నారు. పలు అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. బుధవారం నాటి సమావేశమే కీలకం’ అని కెసి త్యాగి వెల్లడించారు. ఎన్నికల గుర్తుపై చర్చించిన తరవాత ఓ నిర్ణయానికి రావచ్చని, బహుశా సైకిల్ గుర్తు ఖరారు కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 5న ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నినాదం ఇచ్చారు. ‘ఏక్ జండా..ఏక్ నిషాన్’ అంటూ లాలూ ప్రకటించడం గమనార్హం. జనతా పరివార్ ఏర్పాటయితే బీహార్‌లో బిజెపిని నామమాత్రం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో ఆరు పార్టీల పరివార్ పనిచేస్తుందని లాలూ తెలిపారు. ‘విలీనమంటే విలీనమే అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు’ అని ఆర్‌జెడి అధినేత స్పష్టం చేశారు. పార్టీ గుర్తుపైనే స్పష్టత లేదుతప్ప మిగతా అన్నింటిలోనూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన అన్నారు. లౌకికవాద పార్టీలతోనూ కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లాలూ పేర్కొన్నారు. మరి ఈ దోస్తీ ఎన్నాళ్లు ఉంటుంది... ఎన్నికల వరకు ఎలాంటి విభేదాలు లేకుండా వీరు కలిసే ఉంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janata pariwar  mulayam singh  jds  devegouda  laluprasad  chowthala  

Other Articles