Soniagandhi | Rahulgandhi | AICC | President

Sheela dexit and some more congress leaders sonia gandhi as aicc president

AICC, Congress, rahul, sonia, rahul gandhi, president, sonia gandhi

Sheela dexit and some more congress leaders sonia gandhi as aicc president. The congress vice president not got condidence from all congress leaders and some members force to sonia to continue as AICC president.

కాంగ్రెస్ కి "రాహువు" రాహులా..?

Posted: 04/15/2015 01:04 PM IST
Sheela dexit and some more congress leaders sonia gandhi as aicc president

పార్టీని ముందుకు తీసుకువెళతాడు అనుకున్న రాహుల్ బాబు ఇప్పుడు అదే పార్టీని ముంచుతాడు అంటూ అప్పుడూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. రాహుల్ కంటే సోనియానే బెటర్ అంటూ కాంగ్రెస్ నాయకులు పాత స్వరాన్ని పాడుతున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కాంగ్రెస్‌లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్‌కు సోనియా గాంధీ నాయకత్వం కొనసాగాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రకటించారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించకూడదని సీనియర్ నాయకుడు క్యాప్టెన్ అమరీందర్‌సింగ్ బహిరంగంగా ప్రకటించిన రెండు రోజులకే షీలాదీక్షిత్ ఈ ప్రకటన చేయటం గమనార్హం. సోనియా గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సాధించుకోగలుగుతుందని షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పట్ల తనకున్న బాధ్యత నుండి సోనియా గాంధీ పారిపోకూడదని దీక్షిత్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తే మెజారిటీ సీనియర్ నాయకులు వేరేదారి చూసుకుంటారని ఆమె ఆందోళన చెందుతున్నారు.

 సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్‌లోని అన్ని వర్గాల నాయకులను కలుపుకుని పని చేయగలరు. మిగతా నాయకులకు ఈ సామర్థ్యం లేదని ఆమె అభిప్రాయపడుతున్నారు. షీలాదీక్షిత్ కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వం కొనసాగవలసిందేనని సూచించారు. రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో ఆయనను వ్యతిరేకించే వర్గం నాయకులు ఇప్పుడు మరింత ధైర్యంగా సోనియా గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే అంశంపై కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. సీనియర్ నాయకులు, పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు, పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా సోనియా గాంధీ నాయకత్వం పట్లే మొగ్గు చూపుతున్నారు తప్ప రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించటం లేదు.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ బుధవారం స్వదేశం వస్తున్నారని, ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించేందుకు యుపిఏ ఆదివారం రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతుల ర్యాలీలో ప్రసంగిస్తారని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అంశంపై ఒక స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి రాహుల్ వ్యవహారంపై  కాంగ్రెస్ నుండే వ్యతిరేకత వస్తోంది. పార్టీ పగ్గాలను చేపట్టి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఇప్పుడు తన కుమార రత్నంను ఎలా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకువెళుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AICC  Congress  rahul  sonia  rahul gandhi  president  sonia gandhi  

Other Articles