KCR | KTR | Workingpresident | Harishrao

Telanagana rastra samithi party may announce kcr son ktr as its working president

kcr, ktr, harishrao, working president, meeting, no2, TRS

Telanagana rastra samithi party may announce kcr son ktr as its working president. The TRS party may introduce new post in this meeting sessions that may no.2 in the party. Harishrao, ktr like left and rights to kcr.

ఒకటి తర్వాత రెండు.. కెసిఆర్ తర్వాత కెటిఆర్..!

Posted: 04/15/2015 08:49 AM IST
Telanagana rastra samithi party may announce kcr son ktr as its working president

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి, ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్నారు. తర్వాత తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడటం.. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎన్నిక కావడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ లో నెంబర్ వన్ కెసిఆర్ అయితే నెంబర్ టూ ఎవరు అనే ప్రశ్న మొదలైంది. అయితే పార్టీని బలోపేతం చెయ్యడానికి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ పేరుతో కొత్త పదవిని టిఆర్ఎస్ ముందుకు తీసుకువస్తోంది. త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ పదవిని కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అన్నింటికి మించి తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొడుకు.. కాబట్టే ఆ పోస్టుకు కెటిఆర్ అర్హత సంపాదించాడు.

అయితే పార్టీలో మాత్రం ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరూ అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. అయితే  కె.తారకరామారావుకే ఆ బాధ్యతలు ఇస్తారని అనుకుంటున్నా.. మరో ఇద్దరు ముగ్గురు మంత్రులకూ పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం సాగుతోంది. . అయితే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై టిఆర్ఎస్ నేతలు మాత్రం మరోలా చెబుతున్నారు.  విపక్షాల విమర్శలను పార్టీ తరఫున తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అధ్యక్షుడి కంటే, దాదాపు అధ్యక్షుని స్థాయి, హోదా ఉండే మరో నేత ఉండాలన్న అభిప్రాయంతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రి హరీశ్‌రావును ప్రభుత్వ వ్యవహారాల్లో, మంత్రి కేటీఆర్‌ను పార్టీ వ్యవహారాల్లో లెఫ్ట్ అండ్ రైట్ లుగా వాడుకోనున్నారని సమాచారం. మొత్తానికి అన్ని పార్టీల్లో మాదిరిగానే టిఆర్ఎస్ పార్టీలో వారసత్వ రాజకీయలు కొనసాగనున్నాయా లేదా అన్నది తొందరలోనే తేలనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  ktr  harishrao  working president  meeting  no2  TRS  

Other Articles