KCR | Telangana | KCR | Ministers

Telangana cm kcr call to ministers and leaders to go into people

Tenagana, cm, kcr, govt,schmes, ministers, people, policy, new programmee

Telangana cm kcr call to ministers and leaders to go into people. Tengana Cm kcr suggest the ministers and public respresents to go viral and publish govt policys and schems to people.

ప్రజల్లోకి వెళ్లండి.. పధకాలను తీసుకెళ్లండి: కెసిఆర్

Posted: 04/15/2015 07:42 AM IST
Telangana cm kcr call to ministers and leaders to go into people

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కళాకారులపైనే ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ఏవిధంగా కీలక భూమిక పోషించారో, అదే స్ఫూర్తితో సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి పాటు పడాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాల్‌కిషన్, కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా చేపడుతోన్న మిషన్ కాకతీయలో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా చైతన్యపర్చేలా కళాకారులు ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇంటింటికి తాగు నీటిని అందించడానికి చేపడుతోన్న వాటర్ గ్రిడ్ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి శ్రమదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించే విధంగా కవులు తమ కలాలకు పదును పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూపొందించిన డాక్కుమెంటరీ బాగుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. గతంలో రెండు వందల రూపాయలు చెల్లించిన సామాజిక ఫించన్లను వెయ్యి రూపాయలకు పెంచిన ప్రజలలోకి తీసుకెళ్లలేకపోయామని, ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి సాంస్కృతిక సారథి అమితంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tenagana  cm  kcr  govt  schmes  ministers  people  policy  new programmee  

Other Articles