TIME | Modi | Kejriwal | Top100

Narendra modi kejriwal got place in the list of times top 100

narendra modi, arcind kejriwal, modi, kejriwal, top100, TIME, magazine, India

narendra modi, kejriwal got place in the list of Times top 100. The Indian Prime minister narendra modi and delhi cm, aap convenor arvind kejriwal gpt place in top 100 persons in The TIMEs magazine.

నరేంద్రమోదీ, కేజ్రీవాల్ ల 'టైమ్' వచ్చింది.. టాప్ 100లో స్థానం

Posted: 04/15/2015 08:57 AM IST
Narendra modi kejriwal got place in the list of times top 100

టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో మోదీ, కేజ్రీవాల్ లు స్థానం పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్‌లకు ప్రపంచంలోని వందమంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో స్థానం లభించింది. ఈ ఏడాది పోల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే మోదీకి పోలయిన మొత్తం ఓట్లలో 0.6 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. 34 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా, 66 శాతం మంది వ్యతిరేకంగా ఓటేసారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత జవసత్వాలు కల్పిస్తానన్న హామీతో గత ఏడాది అధికారంలోకి వచ్చిన ఈ ప్రజాకర్షక నాయకుడు పలు కీలక ఆర్థిక సంస్కరణలను అమలు చేసారని, గత ఏడాది అమెరికాలో పర్యటించిన తర్వాత గత జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత్‌కు ఆహ్వానించడం ద్వారా అమెరికాతో తిరిగి సన్నిహిత సంబంధాలను నెలకొల్పారని మోదీ గురించి టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. కాగా, కేజ్రివాల్‌కు 0.5 శాతం ఓట్లు లభించగా, ఈ జాబితాలో ఆయన ఉండకూడదని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. 2013లో కొద్ది రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండిన కేజ్రివాల్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీలయిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలను మట్టిగరిపించి తిరిగి తన ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తెచ్చారని మ్యాగజైన్ అభిప్రాయపడింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా మొదట ఈ జాబితాలో ఉన్నారు కానీ టాప్-100లో స్థానం పొందడానికి అవసరమైనన్ని ఓట్లను ఆయన పొందలేకపోయారు.

ఈ ఆన్‌లైన్ పోల్‌లో విజయం సాధించిన వారిలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని భావిస్తున్న హిల్లరీ క్లింటన్, దలైలామా, హారీ పాటర్ నటి ఎమ్మా వాట్సన్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్‌జాయ్, పోప్ ఫ్రాన్సిస్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా, ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుగర్‌బర్గ్, యాపిల్ సిఈఓ టిమ్ కుక్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తదితరులున్నారు. భారతీయ సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, మరో భారతీయుడు, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ర్యాప్‌స్టార్ కనే్యవెస్ట్, మీడియా మొగల్ ఓప్రా విన్‌ఫ్రే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యాహూ సిఈఓ మారియా మేయర్‌కు కూడా ఈ జాబితాలో స్థానం పొందిన వారిలో ఉన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  arcind kejriwal  modi  kejriwal  top100  TIME  magazine  India  

Other Articles