Faverhospital | Kcr | Telanagana

Telangana cm kcr verify the situations at fever hospital at hyderabad

faver hospital, hyderabad, kcr, telangana, verify, doctors

telangana cm kcr verify the situations at fever hospital at hyderabad. He ask the hospital workers about the patients and etc. kcr personally verify the premises of the fever hospital.

ఫీవర్ ఆస్పత్రిలో కెసిఆర్ ఆకస్మిక తనిఖీ

Posted: 04/11/2015 03:15 PM IST
Telangana cm kcr verify the situations at fever hospital at hyderabad


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఎక్కడికి వెళతాడో అధికారులకు కూడా తెలియడం లేదు. ఆ మధ్య వరంగల్, మహబూబ్ నగర్ లలో పర్యటించి అక్కడి సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు. అయితే నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారులపై చర్యలకు కూడా కెసిఆర్ వెనకడుగు వెయ్యడం లేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో ఉన్న ఫీవర్  ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆస్పత్రిలోని అన్ని వార్డులను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుగుతూ పరిశీలించారు. ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించి అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండటంతో సీఎం తన ఆకస్మిక తనిఖీ విషయం ఏమైనా తెలిసి శుభ్రం చేశారా ? అని అధికారులను కేసీఆర్ అడిగారు.అదే సమయంలో ఆస్పత్రి సూపరిండెంట్, ఆర్‌ఎమ్‌లు సెలవులో ఉండటంతో అధికారులందరూ సెలవులో ఉంటే ఎలా అని ప్రశ్నించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : faver hospital  hyderabad  kcr  telangana  verify  doctors  

Other Articles