Venkiahnaidu | Nehru | Mim | Congress

Venkaiah naidu attacks on caongress and mim party at media meet

venkiahnaidu, venkaiah, parliament, mim, congress, nehru, owisi, encounter, vikar

venkaiah naidu attacks on caongress and mim party at media meet. parliamentary affairs minister venkiah naidu attcks mim on vikar gang encounter. And also fire on congress on nehru sryed on netaji family for two decades.

ఓహో.. చాలు చాలు.. మస్తు చెబుతుంటరు

Posted: 04/11/2015 03:34 PM IST
Venkaiah naidu attacks on caongress and mim party at media meet

పార్లమెంట్ లో అయినా మరెక్కడైనా మాటలతో మాయ చేస్తుంటారు ఆ నేత. ఆయన మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో ప్రశ్న వెయ్యడానికి కూడా ఆలోచించాల్సిందే. అలా మాటల గారడీతో ఎవరినైనా బురిడీ కొట్టించే సత్తా ఉన్న బిజెపి సీనియర్ నాయకుడు, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవమారాల మంత్రి వెంకయ్యానాయుడు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యవహారం, వికారుద్దీన్ గ్యాంగ్ వ్యవహారంపై స్పందించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్పై నిఘా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.  కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్పై..  నెహ్రూ హయాంలో నిఘా పెట్టినట్లు ఓ లేఖ బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్య పైవిధంగా స్పందించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ముద్రా బ్యాంక్, ఇన్సూరెన్స్, జన్ధన్ యోజన పేద ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

ఎర్ర చందనం కూలీల ఎన్ కౌంటర్ విషయంలో విచారణ చేయాలనడం సబబే కానీ..  వికారుద్దీన్ ఎన్కౌంటర్పై మాట్లాడుతున్న ఎంఐఎం నేతలు పోలీసులపై కాల్పులు జరిపినప్పుడు ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సిమీ కార్యకర్తలను చంపితే మానవ హక్కులు గుర్తుకొస్తాయా అని అన్నారు. తాను మాత్రం ఉగ్రవాదులను అస్సలు సహించనని, వారిని ఎట్టి పరిస్థితుల్లో అయినా వ్యతిరేకిస్తానని అన్నారు. కాగా మొన్న మాత్రం మీడియా ముందు ఆచితూచి మాట్లాడిని వెంకయ్య నాయుడు ఎన్ కౌంటర్ పై ఎంఐఎం నేతల వైఖరిపై మండిపడ్డారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkiahnaidu  venkaiah  parliament  mim  congress  nehru  owisi  encounter  vikar  

Other Articles