Telanagana | Media | Ministers

Telangana ministers met to discuss about the excratia for police

media, telangana, encounter, police, exgratia, ministers, meet, breaking, news

telangana ministers met to discuss about the excratia for police. telanagana minister when go for meeting, media scroll that ministers on serious discussion about the police and police familys excratia. but in that meeting minister not serious.

మీడియా ముందు నవరసాలు.. వెనక మాత్రం నవ్వుల పువ్వులు

Posted: 04/08/2015 01:57 PM IST
Telangana ministers met to discuss about the excratia for police

రాజకీయా నాయకులు మీడియా అంటే ఎంత ప్రేమో చిన్న పిల్లవాడిని అడిగినా  చెబుతారు. అయితే మీడియా ముందు ఎలా మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలని మన వాళ్లు కోచింగ్ సెంటర్ పెడితే కనీసం సీటు కూడా దొరకదేమో. ఎందుకంటే మీడియాను మ్యానేజ్ చెయ్యడం రాజకీయ నాయకులకు వచ్చినంతగా ఎవరికీ రాదు అన్నది అందరికి తెలిసిన నిజం. అయితే చావు రాజకీయాలే ప్రస్తుతం అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ లో జరిగిన ఎన్ కౌంటర్ వ్యవహారం మీడియా ముందు బిల్డప్ గా మారింది. మీడియాను చూడగానే నేతలు తెగ నటించేస్తున్నారు కాదు కాదు ఏకంగా జీవించేస్తున్నారు.

తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లలో పలువురు పోలీసులు మృతి చెందారు. విధి నిర్వహణలో వీరులుగా మారిన వారి కుటుంబాలను ఆదుకోవాలని సర్వత్రా వత్తిడి వస్తుంది  అది సహజం. అయితే హడావిడిగా మంత్రి మండలిలోని కొంత మంది మంత్రులు హాజరు కావడం.. దానిపై మీడియాలో వార్తలు రావడం టకటకా  జరిగిపోయింది. అయితే పోలీసు అమరవీరులకు ఎక్స్‌ గ్రేషియా పెంపు విషయంపై తెలంగాణ మంత్రివర్యులు తలలు పట్టుకున్నారు. తీవ్రవాదుల హంసాత్మక సంఘటనల్లో మృతిచెందిన పోలీసు కానిస్టేబుల్‌ కుటుంబాలకు చెల్లించాలనుకుంటున్న నష్ట పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇలాంటి సంఘటనల్లో గాయపడిన ఇతరులకు, ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం ఎంత మొత్తంలో చెల్లించాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు హోం మంత్రి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ఆర్థికశాఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులు సభ్యులుగా ఉండనున్నారు. అయితే తీవ్రవాదాన్ని ఏ దశలోనూ ఉపేక్షించకూడదని, అణిచివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

మొత్తానికి అలా నిర్ణయాన్ని ప్రకటించడానికి గంటలకు గంటలు చర్చించారు. అయితే మీడియా లో మాత్రం అమరులైన పోలీసుల గురించి ప్రత్యేకంగా మంత్రి మండలి సమావేశం జరుగుతోంది అంటూ ఏకంగా బ్రేకింగ్ పెట్టేశారు. మంత్రుల సమావేశంలో లోపల నవ్వుకున్న మంత్రులు(లోపల పరస్థితులను బట్టి నవ్వుకొని ఉండవచ్చు) బయటకు రాగానే మీడియాను చూసి.. వెంటనే తమ హావభావాలను మార్చుకున్నారు. విచన్న వదనాలతో కనిపిస్తూ.. పోలీసు అమరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. చివరకు ఎక్స్ గ్రేషియా విషయాన్ని వెల్లడించారు. పోలీసుల త్యాగాలను కూడా నేతల ఇలా మీడియా లో హైలెట్ కావడానికి వాడుకోవడం ఏ మాత్రం స్వాగతించకూదని విషయం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : media  telangana  encounter  police  exgratia  ministers  meet  breaking  news  

Other Articles