Rajnathsingh | Calls | Chandrababu

Cenrtal home minister rajnath singh called to ap cm chandrababu naidu on encounter issue

rajnath singh, calls, naidu, chandrababu, ap, tamilnadu

cenrtal home minister rajnath singh called to ap cm chandrababu naidu on encounter issue. rjnath singh enquiry the situation between the ap and tamilnadu.

హలో.. చంద్రబాబూజీ.. క్యా హువా..?

Posted: 04/08/2015 03:06 PM IST
Cenrtal home minister rajnath singh called to ap cm chandrababu naidu on encounter issue

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్  ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. దాంతో ఎన్కౌంటర్పై రాజ్నాథ్ సింగ్కు చంద్రబాబు వివరణ ఇచ్చారు. కాగా తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన  20మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై తమిళనాడు ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఏపిలో జరిగిన ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతొంది. అయితే ఎన్ కౌంటర్ వ్యవహారం ఏపి, తమిళనాడు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్ పై నిరసనలు  వ్యక్తమవుతున్నాయి. జాతీయ మానవ హక్కుల సంఘం నుండి కూడా ఎన్ కౌంటర్ పై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రానికి సమన్లు పంపించింది. అయితే పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారంటూ పలు మానవ హక్కుల సంఘాల నుండి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని రాజ్ నాథ్ సింగ్ సమీక్షించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnath singh  calls  naidu  chandrababu  ap  tamilnadu  

Other Articles