Jairam ramesh | landbill | Nda

Jairam ramesh cleared that the fight aganist the land acquisiation bill and will win

jairam rameshm, NDA, UPA, land pooling, modi, land Acquisiation, Ordinence

jairam ramesh oppose the nda proposed land acquisiation bill and he clear that the congress party will fight aganist the ndas bill and also will get win in this. THe nda govt trying to create the false bill as truth.

పొ..పొ..పోరాడతాం.. విజయం సాధిస్తాం: జైరాం రమేష్

Posted: 04/08/2015 09:39 AM IST
Jairam ramesh cleared that the fight aganist the land acquisiation bill and will win

జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం... అంటూ రజినీ కాంత్ సినిమాలో జీవితం గురించి చెప్పిన నిజాలను జైరాం రమేష్ తప్పకుండా పాటిస్తాను అన్నట్లున్నారు. రజినీ మాటలు అలాంటివి మరి అని మురిసి పోకండి ఎందుకంటే జైరాం రమేష్ మాటలకు కండీషన్స్ అప్లై అని చిన్న స్టార్ గుర్తు ఉంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న భూసేకరణ చట్టంపై తమ పోరాటాన్ని ఆపేది లేదని జైరాం రమేష్ స్పష్టం చేశారు. రజినీ మాటలు అర్థమయ్యాయో లేక ఎన్డీయే వైఖరిపై వ్యతిరేకత ఏమో కానీ పోరాటం తప్పదని, తప్పకుండా విజయం తమదే అంటూ జైరాం రమేష్ అంటున్నారు.

యుపిఏ ప్రభుత్వం భూ సేకరణ బిల్లు నుంచి 13 చట్టాలను మినహాయించిందని, ఎన్డీఏ ప్రభుత్వం సవరించిన చట్టంలో వాటిని చేర్చిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇప్పుడున్న రూపంలో ఈ బిల్లును పార్లమెంటు లోపలా, వెలుపలా వ్యతిరేకించి తీరుతామని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్పష్టం చేశారు. ‘యుపిఏ ప్రభుత్వం భూ సేకరణ బిల్లునుంచి 13 చట్టాలను మినహాయించిందని, కొత్త బిల్లులో తాము వాటిని చేర్చినట్లు ప్రధాని మోదీ ఎక్కడో చెప్పినట్లు నేను పత్రికల్లో చూసాను.. అది నూటికి నూరు శాతం తప్పు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ‘ప్రధాని కొత్తగా ఎలాంటి మేలూ చేయలేదు. 2013లో పార్లమెంటు ఆమోదించిన బిల్లులో ఏం చెప్పారో అదే ఆయన చేసారు’ అని అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే ఏదో ఒకరోజు దానినే జనం నిజమని నమ్ముతారనే వ్యూహం ఒకటి రాజకీయాల్లో ఉందని జైరాం రమేశ్ చెప్పారు. నష్టపరిహారం నాలుగు రెట్లు పెంచడానికి వీలుగా 2014 డిసెంబర్ 31కన్నా ముందే 13 చట్టాల్లో సవరణ చేయడం తప్పనిసరని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పని చేయాలని 2013 నాటి చట్టం చాలా స్పష్టంగా చెబుతోందని అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jairam rameshm  NDA  UPA  land pooling  modi  land Acquisiation  Ordinence  

Other Articles