Police | Identifi | Bodys

Police identifi the bodys of smuglers who died in shashacham encounter

police, encounter, tirupathi, ruya, postmartum, bodys,

police identifi the bodys of smuglers who died in shashacham encounter. police clear that in the 20 members, 4 persons belogs to vellure, 8 from villupuram, 8 from thiruvannamalike.

ఎన్ కౌంటర్ లో చనిపోయింది ఎవరో గుర్తించారు

Posted: 04/08/2015 09:36 AM IST
Police identifi the bodys of smuglers who died in shashacham encounter

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు గుర్తించారు.  చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే. వారిలో నలుగురు వేలూరు, ఎనిమిది మంది విల్లుపురం, మరో  ఎనిమిది మంది తిరువణ్ణామలైకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతులకు రుయా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించనున్నారు.

మరోవైపు ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ప్రభావం తిరుపతిలో భక్తులు,ప్రయాణికులపై పడింది. ఎన్కౌంటర్కు నిరసనగా తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో తిరుపతి నుంచి తమిళనాడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దాంతో భక్తులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో అవస్థలు పడుతున్నారు. అయితే తిరుపతిలో పరిస్థితి వేడెక్కింది. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు తిరుపతిని చుట్టుముట్టారు. భారీ ఎత్తున తిరుపతిలో పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్ కౌంటర్ పై తమిళనాట ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుపతిలోని తమిళులు ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police  encounter  tirupathi  ruya  postmartum  bodys  

Other Articles