Telanagana | Police | Verification

Telangana police verifying secendrabad station and all over state

Telanagana, Police, Secendrabad, Station, Railway, Passengres

telangana police verifying secendrabad station and all over state. In the secendrabad railway station police verifiing passingers at the station. Telanagana police searching all over.

ఐబీ హెచ్చరికలతో పోలీసుల సోదాలు.. తెలంగాణలో హై'టెన్షన్'

Posted: 04/08/2015 10:10 AM IST
Telangana police verifying secendrabad station and all over state

తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లు ఇప్పుడు కొత్త భయాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలొ వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లు, సెమీ ఉగ్రవాదుల హతం నేపథ్యంలో ప్రతీకార దాడులు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యురో హెచ్చరికలు జారీ చేసింది. దాంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతాయని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ ఎస్ జే జనార్దన్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జానకీపురం, అలేరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరుగుతున్న తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు స్టేషన్ మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలకు అందరు సహకరించాలని పోలీసులు ప్రయాణికులను కోరుతున్నారు. అయితే పోలీసుల సోదాలతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తత నెలకొంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  Police  Secendrabad  Station  Railway  Passengres  

Other Articles