Modi | Judiciary | Worship

Judges are worships as god in an india modi said

modi, judiciary, judges, cji, judgement, country, worship,

the people in government commit mistake, the judiciary is the place where our mistakes are corrected, if judges commit errors, the institutional credibility comes to en end…The need of the hour is in-built dynamic mechanism for self- introspection. If we do not develop the mechanism, the public will lose their faith in the institution which will result in a great loss to the country,”

జడ్జిలను దేవుళ్లలా చూస్తారు: ప్రధాని నరేంద్రమోదీ

Posted: 04/06/2015 09:21 AM IST
Judges are worships as god in an india modi said

న్యాయ వ్యవస్థను దైవంగా, జడ్జిని దేవుడితో సమానంగా సామాన్యుడు భావిస్తూ ఉంటాడని ప్రధాని అంటూ, అందువల్ల ఆత్మవిమర్శ చేసుకోవడానికి దానికి అంతర్గతంగా వ్యవస్థ ఉండాలని, అయితే అది చాలా క్లిష్టమైన పనని అన్నారు. రాజకీయ వర్గాలపైన ఇప్పుడు మీడియాతో పాటుగా ఇతర వ్యవస్థల నిరంతర నిఘా ఉంటోందని మోదీ అంటూ, ‘ప్రజలు మమ్మల్ని గమనిస్తూ ఉంటారు. తప్పు చేస్తే ఏమాత్రం క్షమించరు. అయితే న్యాయ వ్యవస్థకు అలాంటి అవకాశం లేదు. మీరు ఒక వ్యక్తికి మరణ శిక్ష విధిస్తే, ఆ వ్యక్తి న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని అంటాడే తప్ప తీర్పును విమర్శించడు. విమర్శకు అవకాశం లేనప్పుడు మీరే అంచనా చేసుకోవడానికి అంతర్గతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. అలాంటి వ్యవస్థ లేనప్పుడు చిన్నపాటి తప్పు జరిగినా న్యాయ వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని, అది దేశానికి కూడా మంచిది కాదన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పడం చాలా సులభం. అయితే భావనలకు అనుగుణంగా తీర్పు చెప్పే విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.

సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యాయ వ్యవస్థ శక్తివంతంగానేకాక లోపరహితంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని మోదీ స్పష్టం చేశారు. జడ్జిలను దైవంతో సమానంగా చూస్తారని, అంతేకాక న్యాయ వ్యవస్థపై ఎలాంటి విమర్శా చేయడానికి సామాన్యుడు ఇష్టపడడని, అందువల్ల ఆత్మపరిశీలన చేసుకోవడానికి న్యాయవ్యవస్థకు ఒక అంతర్గత వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని ఆదివారం ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. న్యాయవ్యవస్థ బలమైనదిగా మారేకొద్దీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా ఎలాంటి లోపమూ లేనిదిగా కూడా తయారు కావాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.

రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వం తప్పు చేస్తే న్యాయవ్యవస్థ ఆ నష్టాన్ని సరి చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మీరు తప్పు చేస్తే వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతుంది అని మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు గాసిప్ కాలమ్‌లో సైతం పనికి రాని వార్త ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. మేమంతా 24 గంటలు నిఘా ఉండే రాజకీయ వర్గంనుంచి వచ్చాం. రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకోసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజకీయవర్గమంటే ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. అలాంటి వర్గంనుంచి వచ్చినప్పటికీ మేము మాపై ఎన్నో ఆంక్షలు విధించుకున్నాని రాజకీయ వర్గాలపై నిఘా పెట్టి ఉండే ఎన్నికల కమిషన్, సమాచార హక్కు చట్టం, లోక్‌పాల్‌లాంటి వ్యవస్థలను ప్రస్తావించారు. ‘అంతేకాదు వ్యక్తి ఎంత మంచి వాడయినప్పటికీ సంస్థాగత నెట్‌వర్క్ బాగాలేకుంటే దిగజారిపోయే అవకాశముంటుంది. తల్లిదండ్రులు డబ్బులు లాకర్లలో పెట్టి తాళం వేస్తుంటారు. దొంగలు దోచుకోకుండా ఉండటం కోసం వాళ్లు ఆ పని చేయరు. దొంగలు మొత్తం ఇనప్పెట్టే ఎత్తుకు పోగలరు. తమ పిల్లలు చెడు అలవాట్లకు లోనుకాకుండా ఉండటం కోసమే ఆ పని చేస్తారు. మనకు కూడా ఇది అవసరం’ అని మోదీ చెప్పారు. లోపభూయిష్టమైన చట్టాలే కోర్టుల్లో కేసులు పేరుకు పోవడానికి కారణమని ప్రధాని అంటూ, అందుకే పనికిరాని చట్టాలన్నిటినీ రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  judiciary  judges  cji  judgement  country  worship  

Other Articles