IB | Attcks | Warning

Intelligence bureau alerts security at delhi and all major cities

Jaish-e-Mohammad, Delhi, Intelligence Bureau, Sambaattack, J&K, Pakistan, ib, security

The Intelligence Bureau has alerted the Delhi Police about a possible Samba-style 'fidayeen' attack in the capital. Investigations into the recent Samba fidayeen attack on an Army camp in J&K has brought into light that Pakistan-based Jaish-e-Mohammad is planning to carry out a terror attack in Delhi.

రాజధానిపై మరోసారి ఉగ్రపంజా! .. హెచ్చరించిన ఐబి

Posted: 04/06/2015 09:30 AM IST
Intelligence bureau alerts security at delhi and all major cities

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఆత్మాహుతి దళాలు దాడి చేసే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి. గత నెల జమ్మూ, కాశ్మీర్‌లోని సాంబా ప్రాంతంలో భద్రతా దళాలపై మిలిటెంట్లు దాడి జరిపిన సంఘటనలో చనిపోయిన మిలిటెంట్లలో ఒకరినుంచి కేంద్ర భద్రతా దళాలు ఒక చీటీని కనుగొన్న తర్వాత ఢిల్లీ పోలీసులను ఇంటెలిజన్స్ వర్గాలు ఈమేరకు హెచ్చరించాయి. భద్రతా దళాలు, హతులైన మిలిటెంట్ల జేబు నుంచి ‘వచ్చేసారి మనం ఢిల్లీలో కలుసుకుందాం’ అని రాసి ఉన్న చీటీని స్వాధీనం చేసుకున్నప్పటినుంచి అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర భద్రతా ఏజన్సీలు ఢిల్లీ పోలీసులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. గతంలోకూడా ఇలాంటి హెచ్చరికలు చేయడం జరిగింది. భద్రతా దళాలకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ముందుజాగ్రత్త చర్యగా సంబంధిత పోలీసులను అప్రమత్తం చేయడం మామూలే.

‘సాంబా ఆత్మాహుతి దాడి తరహాలో ఢిల్లీలో దాడులు జరపడానికి జైషే మహమ్మద్ పథకాలు వేస్తోంది’ అని కేంద్ర భద్రతా ఏజన్సీలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించినట్టు తెలుస్తోంది. గత నెల 19 అర్ధరాత్రి నలుగురు మిలిటెంట్లు జమ్మూలోని సాంబా సెక్టార్‌లో సరిహద్దులు దాటి మన భూభాగంలోకి చొరబడిన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూపు స్థానిక పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చగా, మరో ముఠాను సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరక్కుండా చూడడానికి తమ పరిధిలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు పంపిన ఆ అడ్వైజరీలో సూచించినట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. దీనికి అనుగుణంగా దేశ రాజధానిలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిఘా పెట్టి ఉంచడంతోపాటు నగరంలోని లాడ్జిలు, లోబడ్జెట్ హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaish-e-Mohammad  Delhi  Intelligence Bureau  Sambaattack  J&K  Pakistan  ib  security  

Other Articles