GHMC | Elections | Hyderabad

All partys in telangana are ready for the ghmc elections in hyderabad

elections, ghmc, hyderabad, baldia, trs, tdp, congress, trs, lokesh, bjp, mim

all partys in telangana are ready for the ghmc elections in hyderabad: In the new state telangana capital city hyderabad election may in next few months. The congress, bjp, trs and tdp ready for the elections.

హైదరాబాద్ ఎవరి సొంతం అవుతుందో.. ఎన్నికలకు పార్టీలు సిద్దం

Posted: 04/06/2015 09:08 AM IST
All partys in telangana are ready for the ghmc elections in hyderabad

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఎన్నికలపై హైకోర్టులో కేసులు సాగుతున్నాయి. కోర్టుతీరును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. వారంలోపే హైకోర్టు సైతం ఎన్నికలపై స్పష్టత ఇవ్వనుంది. ప్రభుత్వం సైతం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలనాటికి హైదరాబాద్‌లో గణనీయమైన మార్పును చూపించడం ద్వారా అభివృద్ధితో విజయం సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నాయకత్వం హైదరాబాద్ ఎన్నికలపై ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ వాదంవల్ల తెలంగాణ జిల్లాల్లో పార్టీ పూర్తిగా బలహీనపడినా, గ్రేటర్ పరిధిలో బలంగాఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఎన్నికల్లో తెదేపా తరఫున నారా లోకేశ్ ప్రచారం సాగించనున్నారు. తాను ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తాను హైదరాబాదీని అంటూ గతంలో ప్రకటించిన లోకేశ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. తెలంగాణకు చెందినవారు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు పెద్దసంఖ్యలో రాజధాని నగరంలో ఉండటంతో టిడిపి, బిజెపి కూటమి ప్రధానంగా వీరిపై దృష్టి సారించారు. సహజంగా నగరంలో బిజెపికి ఉండే పార్టీ శ్రేణులబలంతోపాటు టిడిపితో పొత్తువల్ల రెండుపార్టీలు ప్రయోజనం పొందుతాయని ఆ పార్టీ నేతల అంచనా.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలో నాయకులు ఒకరి మాట మరొకరు వినే పరిస్థితి లేదు. అయితే గల్లీల్లో ఆ పార్టీకి మంచి కార్యకర్తల బలం ఉంది. కె రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం గ్రేటర్ సీటును కైవసం చేసుకునేంత బలం ఆ పార్టీది. నేతల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలున్నా, గల్లీస్థాయిలో పట్టున్న కార్యకర్తలు ఆ పార్టీలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ ఎప్పటి మాదిరిగానే పాత నగరంపైనే దృష్టి సారించింది. 30నుంచి 40 వార్డుల్లో ఆ పార్టీకి ఎదురులేదు. వార్డుల సంఖ్య 150నుంచి 200కు పెంచినందున ఇప్పుడా పార్టీకి అదే స్థాయిలో వార్డుల పెరిగే అవకాశం ఉంది. ఎంఐఎం, తెరాస ఏకమయ్యాయనే అంశం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిజెపి ప్రచారం ప్రారంభించింది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో హైదరాబాద్‌లోని బలంతోనే గెలిచినందున గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా, భాజపా కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. మూడునెలల తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనే అంచనాతో ప్రభుత్వం ఉంది. అందుకే వందరోజుల కోసం నగర అభివృద్ధిపై ఒక ప్రణాళిక ప్రకటించారు. వంద రోజుల్లో సాధించిన అభివృద్ధి వల్ల నగరంలో ఓటర్లపై అధికార పక్షానికి అనుకూలంగా ప్రభావం ఉంటుందని తెరాస భావిస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elections  ghmc  hyderabad  baldia  trs  tdp  congress  trs  lokesh  bjp  mim  

Other Articles